తెలుగు సినీ పరిశ్రమలో చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రభాస్ సినీ పరిశ్రమకు వచ్చిన మొదట్లో కొంతమేర అవకాశాలు దక్కించుకోవడం కోసం ఇబ్బందులు పడినప్పటికీ “వర్షం” చిత్రం మంచి హిట్ అవడంతో అక్కడినుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది.
అంతేకాక ప్రభాస్ కెరియర్ లో బాహుబలి, సాహో తదితర భారీ బడ్జెట్ చిత్రాలు చేసి ఔరా అనిపించాడు.
అయితే తాజాగా ఈ హీరో ప్రభాస్ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే హీరో ప్రభాస్ తాను ఒక చిత్రంలో హీరోగా నటించాలంటే దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.అయితే బాహుబలి కంటే ముందు 20 నుంచి 25 కోట్లు తీసుకునేటువంటి ప్రభాస్ ఒక్కసారిగా బాహుబలి చిత్రం మంచి హిట్ అవడంతో డబుల్ చేసినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్” అనే చిత్రంలో నటిస్తున్నాడు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు పూర్తి అయినట్లు సమాచారం.అలాగే టాలీవుడ్ యంగ్ దర్శ కుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోగా నటించేందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.