తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన స్వర్గీయ నటి సౌందర్య గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు. అయితే ఈమె ప్రస్తుతం భౌతికంగా ప్రేక్షకుల మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ ఆమె నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
అయితే ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నటువంటి సీనియర్ హీరో జగపతి బాబు ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి అప్పట్లో మీకు స్వర్గీయ నటి సౌందర్య కి మధ్య ఎఫైర్ ఉందని పలు వార్తలు వినిపించాయి దీనిపై మీ స్పందన ఏంటని ప్రశ్నించాడు.
దీంతో జగపతి బాబు నిర్మొహమాటంగా అవును ఎఫైర్ ఉందని స్పష్టం చేశాడు. అంతేగాక ఎఫైర్ అంటే సంబంధం అని అర్థం వస్తుందని తనకు నటి సౌందర్య తో అప్పట్లో మంచి సంబంధం మరియు సాన్నిహిత్యం ఉండేదని వివరణ ఇచ్చాడు.
అంతేకాక నటి సౌందర్య కుటుంబ సభ్యులు కూడా తనతో ఎంతో సన్నిహితంగా మెలిగే వారిని అందువల్ల తనని తమ ఇంట్లో ఒకడిగా చూసేవారని తెలిపాడు.దీంతో కొంతమంది తమ మధ్య ఉండేటువంటి చనువు కారణంగా గా తప్పుడు వార్తలను ప్రచారం చేశారని తెలిపాడు.
అంతేగాక తనకు నటి సౌందర్య నాటే ఎంతో అభిమానమని పేర్కొన్నాడు.
తాను ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారనే విషయం గురించి అసలు పట్టించుకోనని కేవలం తనకు నచ్చింది చేస్తూ ముందుకు వెళతానని చెప్పుకొచ్చాడు.
అంతేకాక ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కులమతాలను చూడరు కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం కులమతాలను ఎందుకు చూస్తారో… ఇప్పటికీ తనకు అర్థం కాదని పేర్కొన్నాడు.
దీంతో ఈ విషయం గురించి స్పందించినటువంటి కొందరు నెటిజన్లు ప్రస్తుత కాలంలో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కొంతమేర సాన్నిహిత్యంగా మెలిగితే ఇతరులు వారి గురించి లేనిపోని కథలు అల్లుతుంటారని అది సరి కాదని అంటున్నారు.