బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో మరో మలుపు తిరిగింది.ప్రస్తుతం ఈ కేసును ఇటు ముంబయి పోలీసులతో పాటు హీరో తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్న సంగతి అందరికి తెలిసిందే.
కేసు విచారణలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తుంది.కేసును ఏ రాష్ట్రం ఛేదిస్తుందనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.
ఆ దిశగా రెండు రాష్ట్రాలు విచారణ వేగవంతం చేశారు.
నటుడు సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు కేసును దర్యాప్తు కొనసాగించేందుకు బీహార్ పోలీస్ అధికారి వినయ్ తివారీ ముంబయికి చేరుకున్నాడు.
కాగా ముంబాయి మున్సిపల్ అధికారులు ఆలయను బలవంతంగా క్వారంటైన్ కు తరలించారు. 14 రోజుల పాటు క్వారంటైన్ ఉంచి చేతికి క్వారంటైన్ స్టాంపు వేశారు.ఈ ఘటనపై స్పందించిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్వీటర్ ద్వారా జరిగింది వెల్లడించాడు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.
కేసు విచారణ కోసం బీహార్ పోలీస్ అధికారి వినయ్ తివారి వస్తున్నారని ముంబయి అధికారులకు వసతి కల్పించాలని కోరామన్నారు.కాగా అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కరోనా ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ 14 క్వారంటైన్ కు తరలించారని పేర్కొన్నాడు.
దీంతో ఈ రెండు ప్రభుత్వాల మధ్య గొడవ రాచుకుంది.