చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తుంది. అగ్ర రాజ్యాలు సైతం కరోనా అంటే వణికిపోతుంది.
అయితే అధిక బరువు ఉన్న వారికీ కరోనా మరణ ముప్పు ఉందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది.అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటే కరోనాతో చనిపోయే అవకాశాలను పెంచుతుందని తెలిపారు.
ఎందుకంటే? అధిక బరువు ఉంటే సాధారణంగానే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.డయాబెటిస్, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల నుండి ఎన్నో ఆరోగ్య సమస్యలు అధిక బరువు ఉన్నవారిలో ఉంటాయన్న సంగతి తెలిసిందే.
ఇంకా అలానే ఊబకాయంతో బాధపడే వారు తొందరగా వ్యాధుల బారిన పడుతుంటారు.
కరోనా కూడా అధికబరువు ఉన్నవారికి ఎంతో సులభంగా సోకుతుందని, కరోనా వైరస్ సోకితే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని అధ్యయనంలో తేలింది.పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ నిర్వహించిన పరిశోధనలో ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారు మరణించే ప్రమాదంతో పాటు కరోనావైరస్ నుంచి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరించారు.
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు సాధారణ బరువు ఉన్న ప్రజలు తీసుకునే జాగ్రత్తల కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెప్తున్నారు.
బయటకు రాకుండా ఇంట్లోనే ఉండడం ఎంతో మంచిదని వారు హెచ్చరిస్తున్నారు.ఈ కోవిడ్ సమయంలో ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని వీలైనంతవరకు వ్యాయామం చేసి బరువు తగ్గడం ఎంతో మంచిది.