డల్లాస్‌లో నాట్స్ బాలల సంబరాలు

డల్లాస్, టెక్సాస్: డిసెంబర్ 21 అమెరికాలో ప్రతియేటా తెలుగు చిన్నారుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే బాలల సంబరాలు ఈ సారి కూడా ఘనంగా జరిగాయి.నాట్స్ 12 వ వార్షిక సంబరాలను డల్లాస్‌ నాట్స్ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది.

 Nats Dallas Balala Sambaralu Event On Dec 18th, 2021 At Plano, Tx, Nats Balala S-TeluguStop.com

టెక్సాస్‌లోని ప్లానో గ్రాండ్ సెంటర్‌లో జరిగిన బాలల సంబరాల్లో దాదాపు 200 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు.శాస్త్రీయ సంగీతం, నృత్యంతో పాటు సినీ, జానపద విభాగాల్లో ఆట, పాట లపై పోటీలుజరిగాయి.

యునైటెడ్ స్టేట్స్ చెస్ ఫెడరేషన్ సహకారంతో నాట్స్ జాతీయ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ కూడా నిర్వహించింది.నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి యేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంబరాలు కావడంతో చాలా మంది ఈ సంబరాలకు హాజరయ్యారు.5 నుంచి 18 ఏళ్ల సంవత్సరాల వయసున్న విద్యార్థినీ, విద్యార్ధులు తమలోని ప్రతిభను చూపేందుకు పోటీ పడ్డారు.చిన్నారుల ప్రతిభా పాటవాలను నిర్ణయించడానికి సంబంధిత రంగాల్లో అనుభవం ఉన్న వారిని న్యాయ నిర్ణేతలుగా పిలవడం జరిగింది.

Telugu Plano, Dallas, Nats, Natsbalala-Telugu NRI

డల్లాస్ విభాగం నుంచి రాజేంద్ర యనమదల, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ భాను లంక, చక్ కుందేటి, మాధవీ ఇందుకూరి, శ్రీకృష్ణ సల్లాం, ఆశ్విన్ కోట, రాజేంద్ర కాట్రగడ్డ, తిలక్, సుచింద్రబాబు, నాగిరెడ్డి మండల తదితరులు ఈ సంబరాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు.సంజన కలిదిండి, రియా ఇందుకూరి, నవ్య వేగ్నేశ, అంజనా భూపతిరాజు లతో పాటు, యువ వాలంటీర్ల సాయంతో ఈ సంబరాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.నాట్స్ అధ్యక్షులు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, సంయుక్త కార్యదర్శి జ్యోతి వనం, జాతీయ సమన్వయకర్త అశోక్ గుత్తా, నార్త్ ఈస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ యార్లగడ్డ ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.నాట్స్ బోర్డు నుంచి ఆది గెల్లి, ప్రేమ్ కలిదిండి, కిశోర్ కంచెర్ల, కిశోర్ వీరగంధం గారు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు.

డల్లాస్ స్థానిక చాప్టర్ సభ్యులు కిరణ్ జాలాది, ప్రసాద్, మహిళా వేదిక నుంచి దీప్తి సూర్యదేవర, హెల్ప్ లైన్ టీం కవితా దొడ్డ ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించారు.బాలల సంబరాలకు నాట్స్ బోర్డు నుంచి మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసానికి నాట్స్ డల్లాస్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube