వైసీపీ మీద, జగన్ పరిపాలన మీద అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ఉంటాడు.అదే సమయంలో ఆ పార్టీలో కాపు నేతలు అందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ విమర్శలకి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా మాటల దాడి చేస్తూ ఉంటారు.
ఏపీ రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం కనిపిస్తుంది.పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్నాకూడా వైసీపీ నేతలు అంత ఎత్తున లేస్తారు.
వారు లేస్తారు అనేకంటే పవన్ కళ్యాణ్ ని ఇంకా పైకి లేపుతూ తమ ప్రత్యర్ధి అని ఫోకస్ చేస్తూ ఉంటారు అని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.చంద్రబాబుని ఇమేజ్ ని తగ్గించాలంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ చేయాలనే వైసీపీ స్ట్రాటజీలో భాగంగా వారు దీనిని ఫాలో అవుతూ ఉంటారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ విమర్శలతో పాటు అప్పుడప్పుడు జగన్ ప్రభుత్వం చేసే మంచి పనులని ప్రశంసిస్తూ ఉంటారు.తాజాగా వైసీపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 108, 104 అంబులెన్సులని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అది కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ చొప్పున తీసుకొచ్చింది.దీనిపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కూడా జగన్ పై ప్రశంసలు కురిపించారు.గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం.
అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం అని ట్వీట్ చేశారు.అలాగే ఈ కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి జనసేన పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ ట్వీట్స్ ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.