ప్రభాస్ తదుపరి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.మహానటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు దాదాపు రెండు సంవత్సరాల పాటు కష్టపడి ఈ కథను తయారు చేశాడట.
ఈ సినిమాను దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందించబోతున్నారు.అందుకు సంబంధించి హాలీవుడ్ నిర్మాణ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
హాలీవుడ్ నిర్మాణ సంస్థ దాదాపుగా 75 శాతం బడ్జెట్ ను పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ విషయంలో నిజం ఎంత అనేది సినిమా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతటి స్థాయిలో పెట్టుబడిని నిర్మాణ సంస్థ సాధించింది అంటే ఖచ్చితంగా అది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.
మరి ప్రభాస్ సినిమాకు అంతటి సీన్ ఉందా అనేది విడుదల అయితే తేలనుంది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.