ప్రతీరోజు ఒకేలా నిద్రపోవడం కష్టమైన విషయం.ఓరోజు ఏడెనిమిది గంటలు నిద్రపోతే, మరోరోజు రెండు గంటలే నిద్రపోతాం.
ఒక్కోసారి అసలు నిద్రేపట్టదు.ఓరోజు పది గంటలకు నిద్రలో జారుకుంటే, మరోరోజు 12 దాటితే కాని బెడ్ ఎక్కడం జరగదు.
ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదంటున్నారు వైద్యులు.ఒక పద్ధతితో కూడిన నిద్ర శరీరానికి అలవాటు చేయకపోతేనే నిద్రలేమి సమస్యలు వస్తాయని మయో క్లినిక్ ఒక రిపోర్టు విడుదల చేసింది.
రోజు ఒక పద్ధతిగా, ఏడెనిమిది గంటల నిద్ర, ఒక సమయాన్ని నిర్దేశించుకోని పడుకోవడం చాలా తక్కువమంది చేసే పని.కాని అలా అలవాటు చేసుకున్న వారు కనీసం పది-పదిహేను సంవత్సరాలు తమ జీవితకాలాన్ని పెంచుకున్నవారవుతారట.అన్నిటికీ మించి, బ్రతికిన కాలమంతా ఆరోగ్యంగా బ్రతికే అవకాశాలు ఎక్కువ.
బిజీ జీవితం మన చేతుల్లో లేదు నిజమే కాని దీర్ఘకాలిక సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే, సమయాన్ని సరిగ్గా వాడుకోవటం నేర్చుకోక తప్పదు.
ఎంతైనా, ఆరోగ్యం తరువాతే ఏదైనా.