కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలపై కాస్త అతి ప్రేమ చూపిస్తూ ఉంటారు.కానీ ఆ అతి ప్రేమ పిల్లల ప్రాణాలు తీస్తే… తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది… తల్లిదండ్రులు తమ కొడుకు పై చూపించిన ప్రేమ అతి శ్రద్ధ ఏకంగా అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది.
మూత్ర సమస్య ఉన్న తన కొడుకుని నీళ్లు తాగాలి అంటూ తల్లిదండ్రులు చెప్పడమే వారికి తమ కొడుకును దూరం చేసింది.
ఈ ఘటన అమెరికాలోని కొలరాడో లో జరిగింది.
కొలరాడో లో నివాసముంటున్న రైన్, తారాలకు అనే సబీన్ అనే 11 ఏళ్ళ కొడుకు ఉన్నాడు.అయితే అతనికి మూత్ర సమస్య ఉండడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా.
నీరు ఎక్కువ తాగాలని సూచించాడు వైద్యుడు.కానీ సబిన్ మాత్రం ఎక్కువగా నీళ్లు తాగే వాడు కాదు.
ఎన్నిసార్లు హెచ్చరించిన… సబిన్ తీరులో మాత్రం మార్పు రాలేదు.రోజు అతని వెంట పెట్టిన వాటర్ బాటిల్ అలాగే ఇంటికి తిరిగి వచ్చేది. దీంతో తన కొడుకు ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందో అని భయపడిన తల్లిదండ్రులు సబిన్ ను మందలించారు.కిచెన్ లో బంధించి నీళ్లు తాగితేనే బయటకు వదులుతాం అంటూ హెచ్చరించారు.
దీంతో తల్లిదండ్రుల పై కోపంతో నాలుగు గంటలపాటు మోతాదుకు మించి నీరు తాగేశాడు సబిన్ .కాసేపటికి తలుపు తెరిచిన తల్లిదండ్రులు పడిపోయిన సబీన్ ను మంచం మీద పడుకోబెట్టారూ.అప్పటికే వాంతులు చేసుకున్న సబిన్ నీరసించిపోయాడు.అయినప్పటికీ విశ్రాంతి తీసుకుంటాడని భావించిన తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు.చివరికి పొద్దున్నే లేచి చూసేసరికి… శరీరం మొత్తం బిగుసుకుపోయి సబీన్ మరణించాడు.