తను ప్రేమించిన అమ్మాయి కోసం సుడిగాలి సుధీర్ లాక్ డౌన్ లో ఏకంగా...

తెలుగు బుల్లితెరలో ప్రతి  శుక్రవారం ప్రసారమయ్యేటువంటి  ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్, కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుదీర్ ల మధ్య కెమిస్ట్రీ కి తెలుగు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించడంతో షూటింగు నిలిపివేశారు.

 Sudigali Sudheer, Comedian, Tollywood Hero, Rashmi Gautam, Anchor, Heroine-TeluguStop.com

దీంతో చాలామంది సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమ్ కెమిస్ట్రీ ని బాగా మిస్ అయ్యారు.అయితే ఇటీవలే పలు షరతులతో కూడిన సడలింపులు చేపడుతూ షూటింగులకు ప్రభుత్వ అధికారులు అనుమతులు ఇచ్చారు.

దీంతో ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం మళ్లీ యధావిధిగా షూటింగ్ జరుపుకుంటోంది.అయితే తాజాగా షో నిర్వాహకులు ఈనెల 20వ తారీఖున ప్రసారమయ్యేటువంటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

అయితే ఇందులో రష్మి గౌతమ్ ఎంట్రీ ఇస్తూ ఏంటి సుధీర్ లాక్ డౌన్ లో గడ్డం మరి ఇంతలా పెంచేసావ్ అంటూ అడగ్గా తాను ప్రేమించిన వారి గుర్తుగా గడ్డం పెంచాలని చెప్పుకొచ్చాడు.అలాగే రష్మి ఈ లాక్ డౌన్ లో ఎవరినైనా మిస్ అయ్యవా సుదీర్ అంటూ అడగ్గా… మిస్ అయినవారే ఎవరినైనా మిస్ అయ్యావా అని అడిగితే ఏం చెప్పాలని అంటూ ప్రేమగా సమాధానం చెప్పుకొచ్చాడు.

దీంతో కొందరు నెటిజన్లు ఈ సంభాషణని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక సుడిగాలి సుదీర్ ప్రేమించిన అమ్మాయి ఎవరా.? అంటూ వెతుకులాట మొదలుపెట్టారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా లాక్ డౌన్ సమయంలో సుడిగాలి సుధీర్ కి తన కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు చూశారని కానీ సుడిగాలి సుధీర్ మాత్రం తాను పెళ్లి చేసుకునేందుకు మరింత గడువు కావాలని తన కుటుంబ సభ్యులు అడిగినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube