ప్రస్తుత రోజుల్లో మరుసటి క్షణం ఏమవుతుందో కూడా తెలియకుండా జీవితాన్ని అలా గడిపేస్తున్నాం.అప్పటివరకు మనతో మాట్లాడిన ఓ వ్యక్తి కళ్ళు మూసి కళ్ళు తెరిచి లోపల అతనికి ఏమైపోతుందో కూడా తెలియని రోజులు ఇవి.
ఇలా ఎందుకు చెప్పడానికి కారణం అంటే… ఈ మధ్య చాలామంది మాట్లాడుతూ మాట్లాడుతూనే సడన్ గా వారి ప్రాణాలను కోల్పోయిన వారు అనేకం.
ఇకపోతే తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఓ 5 ఏళ్ల బాలుడు తన తండ్రితో కలిసి వారి పొలానికి వెళ్లారు.అక్కడ ఆ బాలుడు కలియతిరుగుతూ ఆడుకుంటున్నారు.
అలా ఆడుకుంటున్న సమయంలో తండ్రి ఆ బిడ్డను వీడియో తీయడంలో పూర్తి నిమగ్నమయ్యాడు. ఇకపోతే తన కొడుకు పాము వైపు కూడా వెళ్లడాన్ని ఆయన గమనించలేదు.
ఇదిలా ఉండగా ఓ పాము అక్కడ పడుకొని ఉంది.
అయితే ఆ పామును ఏదో తాడు అనుకొని ఆ పిల్లాడు పామును పట్టుకున్నాడు.
ఇక అంతే పాము ఒక్కసారి కదిలి పడగవిప్పింది.దీంతో తండ్రి కొడుకులు ఇద్దరూ హఠాత్పరిణామానికి హడలిపోయారు.
లక్కీగా ఆ పాము ఆ బాలుడికి కాటు వేయకుండా వేరే వైపు వెళ్ళింది.ఈ సంఘటనతో ఆ తండ్రికి ప్రాణం పోయినంత పని అయిపోయింది.
ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.అందుకే కాబోలు క్షణం సమయంలో ప్రాణం పోతుంది అంటే ఇలానే ఉంటుందేమో.