ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఝులక్ ఇచ్చిన ఏపీ సర్కార్

ఓ వైపు లాక్ డౌన్ కారణంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఏ ఒక్కరు ప్రశాంతంగా లేరు.ప్రతి ఒక్కరు ఉద్యోగ భద్రత లేక భయంతో బ్రతుకుతున్నారు.

 Apsrtc Lays Off Over 6,200 Contract Employees, Ap Politics, Lock Down, Corona Ef-TeluguStop.com

వర్క్ ఫ్రం హోం చేస్తున్న కంపెనీలు తప్ప మెజారిటీ రంగాలలో చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్ధిక భారంతో కొట్టుకుంటున్నారు.అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్నఅవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కూడా టెన్షన్ మొదలైంది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎప్పుడో మూడు నెలలకి ఒకసారి జీతాలు ఇస్తూ ఉంటారు.అయితే వేల సంఖ్యలో వాటిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు.

అయితే ఇప్పుడు ఉన్నపళంగా బడ్జెట్ తగ్గించుకునే పనిలో ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి.

అందులో భాగంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ మొదటి ఝులక్ ఇచ్చింది.

ఏకంగా 6 వేల మందిపై వేటు వేసింది.ఈరోజు నుంచి విధులకు హాజరు కావద్దంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగిస్తున్నట్టు డిపో మేనేజర్లు తెలిపారు.ఏప్రిల్ నెల జీతాలు కూడా వీరికి ఇంత వరకు అందలేదు.

అయితే ఈ నిర్నేణయంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.ఆర్టీసీ యాజమాన్య తీరును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాయి.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube