నిశ్శబ్ధంలో ఆ పాపనే కీలకం..?

టాలీవుడ్ స్వీటీ అనుష్క నటిస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నిశ్శబ్ధం ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే పలు కారణాల వల్ల ఈ సినిమాను వరుసగా వాయిదా వేస్తూ వస్తోంది చిత్ర యూనిట్.

 Shalini Pandey Plays Key Role In Nishabdham-TeluguStop.com

దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.

ఇక ఈ సినిమాలో అనుష్క ఓ మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తోంది.

కాగా భారీ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో కథ మొత్తం ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.ఈ సినిమాలో అనుష్క స్నేహితురాలు సోనాలిగా అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే నటిస్తోంది.

ఈమె చేసే పాత్ర సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది.షాలినీ చేస్తున్న పాత్ర చాలా సస్పెన్స్‌తో కూడుకున్నదిగా చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ తీర్చిదిద్దాడట.

నిశ్శబ్ధం సినిమాతో తాను మళ్లీ మంచి ఫాంలోకి రావడం ఖాయమని షాలినీ పాండే భావిస్తోంది.అంజలి, మాధవన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ ట్యూన్స్ అందిస్తున్నాడు.

ఏప్రిల్ 2న రిలీజ్ అవ్వాల్సిన నిశ్శబ్ధం సినిమా కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడనుంది.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube