పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు పవన్ ఎసరు పెట్టాడు.
ఇక తమ అభిమాన హీరో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదరుచూస్తున్నారు.అయితే ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమా షూటింగ్‌ను చాలా త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అందుకే శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న వకీల్ సాబ్ గుమ్మడికాయ కొట్టేందుకు రెడీ అయ్యాడు.
ఒక్క షెడ్యూల్ మినహా చిత్ర షూటింగ్‌ను ముగించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.పవన్ లాయర్ పాత్రలో నటిస్తు్న్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు పవన్ ఫ్యాన్స్.