నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో 106వ చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నటిస్తున్నాడు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.
గతకొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా అందాల భామ అంజిలిని ఇప్పటికే ఓకే చేసిన చిత్ర యూనిట్, మరో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్, తమన్నాలను సంప్రదించారట.అయితే బాలయ్య సరసన నటించేందుకు తమన్నా భారీగా రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తోంది.
తమన్నా అడిగిన రెమ్యునరేషన్‌తో చిత్ర నిర్మాత అవాక్కయ్యాడట.అటు కాజల్ మాత్రం తన స్పందన ఇంకా తెలపకపోవడంతో చిత్ర యూనిట్ డైలమాలో పడింది.
కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో బాలయ్య అఘోరాతో పాటు ఫ్యాక్షనిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.మరి తమన్నా అడిగిన రెమ్యునరేషన్‌కు చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.