భీష్మ ఫస్ట్ డే కలెక్షన్లు.. నితిన్ కెరీర్‌లోనే బెస్ట్

యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రంపై మొదట్నుండీ మంచి అంచనాలు ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే మంచి టాక్ వచ్చేసింది.

 Bheeshma First Day Telugu States Collections-TeluguStop.com

ఇక శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో నితిన్ కెరీర్‌లో మరో హిట్టు బొమ్మ పడింది.

ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా కావడంతో మొదటి రోజే దీన్ని చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడ్డారు.

ఇక శివరాత్రి పండగ సెలవు కూడా ఈ సినిమాకు బాగా కలిసి రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు బారులు తీరారు.నితిన్ కామెడీ టైమింగ్, రష్మిక అందాల ఆరబోతతో పాటు నటనతో మెప్పించిన విధానం, వెంకీ కుడుముల మార్క్ టేకింగ్ ఈ సినిమాకు బాగా కలిసి రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ఫుల్ మార్కులు వేశారు.

ఈ చిత్రానికి తొలిరోజే మంచి వసూళ్లు రావడంతో నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ దిశగా ఈ సినిమా సాగుతోంది.ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ.6.28 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.గతంలో నితిన్ నటించిన ‘అ.ఆ’ చిత్రం కంటే కూడా ఇవి ఎక్కువ కావడం గమనార్హం.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.20 కోట్లు

సీడెడ్ – 0.80 కోట్లు

నెల్లూరు – 0.27 కోట్లు

కృష్ణా – 0.40 కోట్లు

గుంటూరు – 0.77 కోట్లు

వైజాగ్ – 0.62 కోట్లు

ఈస్ట్ – 0.66 కోట్లు

వెస్ట్ – 0.56 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 6.28 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube