చైతూతో లిప్‌లాక్‌ సీన్‌కు నో చెప్పిందట

నాగచైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లవ్‌ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్నాడు.షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిన ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Sai Pallavi Says No Lipi Lock For Chaithu-TeluguStop.com

తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.ఆ టీజర్‌లో చివరి షాట్‌లో ఒక ముద్దు సీన్‌ ఉంది.

ఆ ముద్దు సీన్‌ సహజంగా లేదని, ఫీల్‌ కలిగేలా లేదంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.ఇక ఆ ముద్దు సీన్‌ గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

Telugu Nagachaitanya, Sai Pallavi, Saipallavi, Shekhar Kammula, Secondslip-Movie

దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆ సీన్‌లో కాస్త ఘాటుగానే ముద్దు సీన్‌ పెట్టాలనుకున్నాడట.నాగచైతన్య పెదాలపై సాయి పల్లవి ముద్దు పెట్టే సీన్‌, కనీసం 10 సెకన్ల పాటు అది ఉండేలా ప్లాన్‌ చేశారట.కాని ముద్దు సీన్‌లో నటించేందుకు సాయి పల్లవి నో చెప్పిందట.దర్శకుడు శేఖర్‌ కమ్ముల రిక్వెస్ట్‌ చేసినా కూడా ఆమె అందుకు ఒప్పుకోక పోవడంతో ఇలా చెంపపై, అది కూడా చేయి అడ్డు పెట్టి ముద్దు పెట్టినట్లుగా తెలుస్తోంది.

Telugu Nagachaitanya, Sai Pallavi, Saipallavi, Shekhar Kammula, Secondslip-Movie

సాయి పల్లవి, నాగచైతన్య ముద్దు సీన్‌ సినిమాకు హైలైట్‌ అయ్యేది.కాని మంచి ఛాన్స్‌ను సాయి పల్లవి వల్ల మిస్‌ చేసుకుంది అంటూ విమర్శలు వస్తున్నాయి.ముద్దు సీన్స్‌లో హీరోయిన్స్‌ అంతా నటిస్తున్నప్పుడు సాయి పల్లవికి వచ్చిన ఇబ్బంది ఏంటీ, సినిమా కోసం పాత్ర బాగా పండేందుకు, సీన్‌ బాగా వచ్చేందుకు ముద్దు సీన్స్‌ నటించడంలో తప్పు లేదని సాయి పల్లవి ఇంకా ఎప్పుడు తెలుసుకుంటుందో కదా అంటూ నెటిజన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube