2018 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో విడుదలైన టువంటి చిత్రం మహానటి.ఈ చిత్రం అలనాటి అందాల తార, ఎంతోమంది నటీనటుల అభిమాన నటి సావిత్రి గారి జీవిత గాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు.
ఈ చిత్రంలో సావిత్రి గారి పాత్రలో ప్రముఖ నటి కీర్తి సురేష్ నటించగా సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రం విడుదలై మంచి ప్రేక్షకాదరణ మరియు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.
అయితే తాజాగా ఈ చిత్రంపై పై స్వర్గీయ శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందులో సావిత్రి గారి పై ఉన్నటువంటి అభిమానంతో మహానటి చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదని మరియు చూసిన ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు.
అంతేగాక సినిమా చూసిన వెంటనే సావిత్రి గారి పాత్రలో అద్భుతంగా నటించినటువంటి కీర్తి సురేష్ కి ఫోన్ చేసి మాట్లాడాలని అన్నారు.అంతేగాక తనకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించాలని సరైన అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చారు జాన్వి కపూర్.
అయితే ఇది ఇలా ఉండగా తాజాగా జాన్వి కపూర్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.కానీ ఈ మధ్య జాన్వి డేట్లు కాళీ లేకపోవడంతో ఈ చిత్రాన్ని వదిలేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రం లో అనన్య పాండే ని తీసుకున్నట్లు సమాచారం.
.