ఏకంగా ప్రధాని ట్వీట్ ని కాపీ కొట్టిన హీరోయిన్... 

సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చేసేటటువంటి పనులపై నెటిజన్లు వంద కళ్లతో నిఘా వేస్తుంటారు. ఇందులో భాగంగా వారికి ఏదైనా ఒక తప్పు దొరికిందంటే ఆ విషయాన్ని నెట్టింట్లో బాగానే వైరల్ చేస్తారు.

 Bollywood Actress Urvashi Rautela Copied Prime Minister Narendra Modi Tweet-TeluguStop.com

అందువల్ల సెలబ్రిటీలు తమ వ్యక్తిగతంగాగాని లేదా మరే ఇతర విషయమైనా గాని సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి చేస్తారు.అయితే తాజాగా ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ట్వీట్ ని కాపీ చేసినందుకు ఆమెను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఆమె ఎవరు అని అనుకుంటున్నారా….? ఆమె ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాజీ ప్రియురాలు ఊర్వశి రౌతెలా.అయితే ఇటీవల సీనియర్ ప్రముఖ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు.దీంతో బాలీవుడ్లోని ప్రముఖులందరూ ఆమె తొందరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేసి కోరుకున్నారు.

అయితే ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్ ని ఊర్వశి సేమ్ టు సేమ్ కాపీ చేసి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది.

దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.మరి కొంతమంది అయితే ఒక సీనియర్ నటి రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైనా కనీసం ట్వీట్ సొంతంగా రాసి పోస్ట్ పోస్ట్ చేసే అంత టైం లేక వేరే వాళ్ళు చేసినటువంటి పోస్ట్ ని కాపీ చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Narendra Modi, Narendramodi, Primeminisiter, Urvashi Rautela-Movie

అందుకే సోషల్ మీడియా పట్ల ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలని మరోసారి ఊర్వశి ద్వారా అర్థమవుతోంది.ఏదేమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ట్రీట్ ని ఊర్వశి కాఫీ చేసి తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మాత్రం ఆమెను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.అయితే నెట్టింట్లో ఇంత జరుగుతున్నప్పటికీ ఊర్వశి మాత్రం ఈ విషయాలపై స్పందించడం లేదు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube