నాగిన్ డాన్స్ చేసిందని భార్యను హత్య చేసిన భర్త...

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే మనుషులు కోపోద్రిక్తులై ప్రాణాలు తీసేస్తున్నారు.తాజాగా ఓ మహిళ అ పెళ్లిలో నాగిని డాన్స్ చేసినందుకు గాను తన భర్త ఏకంగా ఆమె గొంతు కోసి చంపిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 Husband Murdered His Wife For The Nagin Dance In Bihar-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ఖోరంగ్ పూర్ అనే గ్రామంలో రంజిత్ మంజి మరియు మునియా దేవి అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు.అయితే తాజాగా వీరిద్దరూ కలిసి తమ బంధువులు అయినటువంటి ఓ వ్యక్తి పెళ్లి జరుగుతుండగా ఈ పెళ్లికి హాజరయ్యారు.

ఈ క్రమంలో వివాహ వేడుక అనంతరం ఊరేగింపు సందర్భంగా పెళ్లిలో డీజే కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పెళ్లికి హాజరైన టువంటి పలువురు డాన్సులతో హోరెత్తించారు.

ఇది చూసినటువంటి మునియా దేవికి కూడా డాన్స్ చేయాలనిపించింది.దీంతో వెంటనే నాగిని పాటకి డాన్స్ చేసింది.

Telugu Bihar, Bihar Latest, Muniya Devi, Nagin Dance, Ranjith Manji, Latest-Telu

అయితే ఈ విషయం తన భర్త అయినటువంటి రంజిత్ మంజికి నచ్చలేదు.దీంతో అతడు ఆమెను వెంటనే పక్కకు తీసుకెళ్ళి అసభ్య పదజాలంతో దూషించగా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఈ గొడవలో తీవ్రంగా కోపానికి గురైనటువంటి రంజిత్ ఆమెని ఇంటికి తీసుకెళ్లి గొంతు కోసి పరారయ్యాడు.ఇది గమనించిన టువంటి స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మార్గమధ్యంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

దీంతో మునియా దేవి బంధువులు నిందితుడు రంజిత్ పై ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube