కత్రినాకైఫ్ సినిమా కెరీర్ ను స్టార్ట్ చేసి పదేళ్ళు అయింది.ఈ టైములో అమ్మడు ఓ వైపు సినిమాలు చేస్తూ లవ్… డేటింగ్ అంటూ చాల రూమర్స్ పుట్టుకొచ్చాయి.
బాలీవుడ్ కి పరిచయం చేసిన సల్మాన్ ఖాన్ తో అమ్మడు చాలకాలం డేటింగ్ చేసింది.అప్పుడు వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఈ రూమర్స్ అన్నింటికీ సల్మాన్ ఖాన్ ఫుల్ స్టాప్ పెట్టాడు.ఆ తరువాత కత్రినా, రన్బీర్ కపూర్ తో ప్రేమ.
డేటింగ్ అంటూ తిరిగింది.
వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.కానీ కొన్ని కారణాల వలన కత్రినా, రన్బీర్ బ్రేక్ అప్ చెప్పుకున్నారు.ఈ విషయాన్నీ కత్రిన పలు సందర్భాల్లో మాది బ్యాడ్ బ్రేక్ అప్ అంటూ చెప్పుకొచ్చింది.
కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉన్న కత్రినా… ‘ఉరి’ సినిమా ఫేం విక్కి కౌశల్ తో మరల ప్రేమ వ్యవహారం నడుస్తుందని వార్తలు వస్తున్నాయి.విక్కి కౌశల్ కి అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ క్రేజీ ఉన్నది.‘రాజీ’ ‘సంజు’ వంటి చిత్రాల్లో లవర్ బాయ్ గా చేసిన విక్కి కి అమ్మాయిల నుండి మంచి రెస్పాన్సు వచ్చింది.
ఇప్పుడు కత్రినా పేరును విక్కి కి జోడించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.వాటికి ఆధారాలు చేకూరుస్తు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియా లో దర్శనం ఇస్తున్నాయి.వీరిద్దరూ ఈసారి దీపావళి సెలబ్రేషన్స్ ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో జరుపుకున్నారు.
దానికి సంబందించిన ఫొటోస్ వైరల్ అవ్వుతున్నాయి.ఇలాంటి విషయాలు కత్రినాకు కామన్ అయినా విక్కి మాత్రం కొత్త అనే చెప్పాలి.
విక్కి ఇప్పుడు, ఇప్పుడే బాలీవుడ్ లో పేరు తెచ్చుకోవడానికి కష్టా పడుతున్నాడు.ప్రస్తుతం విక్కి ‘సర్దార్ ఉదం సింగ్’ చిత్రంలో నటిస్తున్నాడు.