సాధారణంగానే అంబులెన్స్ డ్రైవర్లు రోగుల ప్రాణాలను కాపాడేందుకు వాహనాలను వేగంగా తీసుకెళ్తుంటారు.ఇక భాగ్యనగరం లాంటి మహానగరాల్లో అయితే ఎంతటి ట్రాఫిక్ ఉన్నా వారు దూసుకెళ్లే స్పీడుకు ఇతర వాహనదారులు పక్కకు జరిగి దారిస్తుంటారు.
అయితే కేరళలో ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం వాయు వేగాన్ని మించిన వేగంతో దూసుకెళ్లి ఓ పసిబిడ్డ ప్రాణాలను కాపాడిన తీరు ఆ డ్రైవర్‌పై ప్రశంసలను గుప్పిస్తోంది.
కేరళలో 15 రోజుల పసికందు తీవ్ర గుండెజబ్బుతో సతమతమవుతుండగా ఆ బిడ్డ ప్రాణాలను కాపాడాలంటే వెంటనే అతడిని మంగళూరు నుండి కోచిన్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.
దీంతో సమయం తక్కువగ ఉండటంతో కేరళ ప్రభుత్వానికి విషయం తెలపడంతో మంగళూరు నుంచి కోచిన్ వరకు 418 కిమీ దూరం అంబులెన్సుకు ఎలాంటి ఆటంకం రాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
దీంతో ఆ అంబులెన్సు వెళ్లే దారికి ఎలాంటి అడ్డంకి రాకుండా ప్రజలు మంగళూరు నుండి కోచిన్ వరకు దారి వదలడంతో 11 గంటల ప్రయాణాన్ని కేవలం 5 గంటల్లో అధిగమించాడు.
వాయువేగాన్ని అధిగమించి అంబులెన్సును తీసుకెళ్లిన డ్రైవర్ పసికందు ప్రాణాలను కాపాడినందుకు అతడిని ప్రశంసలతో ముంచెత్తారు.