రెండు రోజుల పాటు సౌదీ లో పర్యటించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సౌదీ యువరాజు పంపిన ప్రత్యేక విమానంలో అమెరికా కు చేరుకున్నారు.వాణిజ్య మరియు సాధారణ విమానాల్లో అమెరికాకు వెళ్లోద్దని మీరు మా అతిధి అంటూ సౌదీ యువరాజు తన ప్రత్యేక విమానంలో ఇమ్రాన్ ను అమెరికా కు పంపించారు.ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కూడా భేటీ ఆయిన ఇమ్రాన్ ఆ తరువాత న్యూయార్క్ లో కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్(సి ఎఫ్ ఆర్) మేధో వర్గ సదస్సు లో ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.9/11 దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో చేతులు కలపడం అతి పెద్ద తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాడు తాము తటస్థంగా ఉండాల్సిందని నాడు అమెరికా తో చేతులు కలపడం ద్వారా “9/11 తరువాత యుఎస్ తో చేతులు కలపడం వలన 70,000 మంది పాకిస్తానీయులు మరణించారని చెప్పుకొచ్చారు.కొంతమంది ఆర్థికవేత్తలు మా ఆర్థిక వ్యవస్థకు 150 బిలియన్లు మరి కొందరు 200 బిలియన్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారని చెప్పుకొచ్చారు.
అన్నిటికంటే ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన యుద్ధంలో యుఎస్ గెలవకపోవడానికి కారణం తామే అని నిందించబడ్డామని ఆయన తన బాధను వెళ్లగక్కారు.మరోపక్క కాశ్మీర్ అంశం లో మధ్యవర్తిత్వం వహిస్తాను అంటూ మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఈ విషయంలో ఇమ్రాన్ ను నేను నమ్ముతాను అని కాశ్మీర్ అంశం పై మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యలు చేశారు.మరోపక్క ఇమ్రాన్ వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.