ఇప్పటికే తెలంగాణా లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ పార్టీకి, ఏపీ లో కూడా అస్తమయమయ్యే పరిస్థితితులు కనిపిస్తున్నాయి.ఈ క్రమంలో రాజ్యసభ సభ్యులు బీజేపీ లో చేరడం తో ఆ పార్టీ అయోమయం లో పడింది.
ఏపీ లో టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అర్ధంకాకుండా పోయింది.ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ లపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన చేశారు.పదవుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు గొంతు కోసేవారు వీరు అంటూ వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అంతేకాకుండా… సుజనా చౌదరి,సీ ఎం రమేష్ లను పార్టీ పలు పోసి పెంచి తప్పు చేసింది.ఇప్పుడు వారి బుద్ది చూపించారు అంటూ ఆయన విరుచుకుపడ్డారు.అయితే ఇప్పుడు వారు పార్టీ మారి చంద్రబాబు కు మంచే చేశారు.
ఒకవేళ వారికి పదవులు ఇస్తామంటే చాలు బాబు గొంతు కోసేందుకు కూడా వీరు సిద్ధంగా ఉంటారు అని వ్యాఖ్యలు చేశారు.బాబు చుట్టూ ఇలాంటి నేతలు చేరి కమిట్ మెంట్ ఉన్న నేతలను పార్టీలోకి రాకుండా చేసారని, అలానే పార్టీ లో కమిట్ మెంట్ ఉన్న నేతలను పార్టీకి దూరంగా చేశారంటూ బుద్దా ఆరోపించారు.
విదేశాలకు వెళ్లిన చంద్రబాబుకు మనశ్శాంతి లేకుండా చేసిన ఈ నలుగురిని వెలివేయాలి అంటూ బుద్దా వెంకన్న టీడీపీ ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ మారిన నలుగురు ఎంపీలను చూసి భయపడడం లేదు.
అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.