పాకిస్తాన్ యుద్ధ విమానాల మీద దాడి చేసి, అనుకోకుండా ప్రమాదంలో ఆ దేశానికి యుద్ధ ఖైదిగా చిక్కిన భారత్ జవాన్ అభినందన్ వర్థమాన్ ని భారత్ కి అప్పగించడానికి పాకిస్తాన్ సిద్ధమైంది.అంతర్జాతీయంగా ఆ దేశంపై వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ ఇక అభినందన్ ని రిలీజ్ చేయడంలో దిగి రాక తప్పలేదు.
ఓ వైపు శాంతి వచనాలు పలుకుతూ, మరో వైపు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ కావ్వింపు చర్యలకి పాల్పడుతున్న పాకిస్తాన్ ని భారత త్రిముఖ వ్యూహంతో ఒంటరి చేసింది.
ఈ నేపధ్యంలో దేశ భద్రత దృష్ట్యా, ప్రజలని కాపాడుకోవడానికి, భారత్ నుంచి వచ్చే ముప్పు తప్పించుకోవడానికి యుద్ధఖైదిగా దొరికిన అభినందన్ ని రిలీజ్ చేయడానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు.
భారత్ తో తాము శాంతిని కోరుకుంటున్నామని అందుకే అభినందన్ ని రిలీజ్ చేస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.ఇదిలా వుంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాఘా సరిహద్దు వద్ద అభినందన్ కి భారత్ కి అప్పగిస్తుందని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో సరిహద్దు వద్దకి అధిక సంఖ్యలో ప్రజలు చేరుకొని అభినందన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.