వినూత్న నిరసన : పాముని కాల్చుకుని తిని...

తమకు కావాల్సిన పని సక్రమంగా సరైన సమయానికి చేసిపెట్టకపోతే ఎవరికైనా కోపం రావడం సహజం.ఆ కోపాన్ని చాలామంది రకరకాలుగా వ్యక్తం చేస్తుంటారు.

 The Farmer Who Eat The Snake In Protest Of The Officers-TeluguStop.com

కొంతమంది వినూత్న రీతిలో తమ నిరసనను తెలుపుతూ … వార్తల్లోకి ఎక్కుతుంటారు.ఈ విధంగానే …

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట అనే గ్రామంలో కీర్తి శ్రీనివాస్ అనే రైతు వినూత్న నిరసనకు దిగాడు.తనకున్న రెండెకరాల భూమికి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఏడాది కాలంగా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్టు వెల్లడించాడు.ఎన్నిసార్లు అధికారులను కలిసినా తన సమస్యను వారు పట్టించుకోలేదన్నాడు.

అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతో పాటు, భీమా పథకాన్ని కూడా పొందలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ నేపథ్యంలోనే ఓ త్రాచు పామును కాల్చుకుని తిని రెవెన్యూ అధికారులకు తన నిరసన వ్యక్తం చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube