హిందీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని గత పది సంవత్సరాలుగా ప్రసారం అవుతూ వస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్.ఈ షో ప్రస్తుతం సౌత్‌లో కూడా ప్రసారం అవుతుంది.
గత ఏడాది తెలుగు మరియు తమిళనాట మొదలు కాగా, ఈ సంవత్సరం మలయాళంలో ప్రసారం అవుతుంది.తెలుగు మరియు మలయాళంలో బిగ్‌బాస్ షో సాఫీగా సాగిపోతున్నా కూడా తమిళనాట మాత్రం పదే పదే వివాదాలు చుట్టు ముడుతున్నాయి.
మొదటి సీజన్ సమయంలో కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొన్న బిగ్‌బాస్ రెండవ సీజన్‌కు కూడా అదే తరహా ఇబ్బందుల పాలవుతుంది.
తమిళ బిగ్‌బాస్ సీజన్ 2లో ఆమద్య ఇచ్చిన ఒక టాస్క్‌లో భాగంగా కొందరు హౌస్ మెంబర్స్ డైపర్లు వేసుకున్నారు.
ఆ డైపర్ల వివాదం ప్రస్తుతం మతం రంగు పులుముకున్నాయి.బిగ్‌బాస్ సీజన్‌లో తమిళ టెక్నీషియన్స్‌ను కాకుండా ఎక్కువ శాతం హిందీకి చెందిన టెక్నీషియన్స్‌ను తీసుకున్నారు అంటూ ఆమద్య వివాదం చెలరేగింది.
ఆ వివాదం సమసి పోయిందో లేదో అప్పుడు మరో వివాదం మొదలైంది.బిగ్‌బాస్ ఇంట్లో ముంతాజ్ వ్యవహారం ఏమాత్రం బాగా లేదని కొందరు ఆరోపిస్తున్నారు.ఆమె డైపర్లు వేసుకుని తిరగడంతో పాటు ఇంట్లో ముద్దు సీన్‌లు కూడా ఉండటం విమర్శలకు తావిస్తుంది.

హిందూ మత ధర్మంకు వ్యతిరేకంగా ఈ షో జరుగుతుందని కొందరు ఆరోపిస్తున్నారు.ఇప్పటికే కొందరు హిందువులు ఈ బిగ్‌బాస్ షోను నిలిపేయాలంటూ కోర్టులను ఆశ్రయించారు.ఇలాంటి షోల వల్ల ప్రజల్లో మతం పట్ల విశ్వాసం తగ్గుతుందని, మగ, ఆడ వారి మద్య వ్యత్యాసాలు పెంచే విధంగా కూడా ఈ షో ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు.
మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కమల్ హాసన్ రెండవ సీజన్‌కు కూడా హోస్టింగ్ చేస్తున్నాడు.ఎంత జాగ్రత్తగా టాస్క్‌లు ఇచ్చినా కూడా తమిళ బిగ్‌బాస్ మాత్రం ఏదో ఒక వివాదాన్ని మెడకు చుట్టుకుంటున్నాడు.
మరో వైపు తెలుగులో నాని హోస్టింగ్‌తో ప్రారంభం అయిన బిగ్‌బాస్ రెండవ సీజన్ నిరాటంకంగా సాగుతుంది.షాకింగ్ టాస్క్‌లు లేకుండా సాదా సీదాగా తెలుగులో ప్రసారం అవుతుంది.
ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అవ్వడంతో షో ఆసక్తికరంగా సాగుతుంది.ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే వారు ఎవరు అంటూ ప్రస్తుతం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 2 వంద రోజుల పాటు కొనసాగబోతుంది.ఇక తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్ 100 రోజులు కొనసాగింది.
రెండవ సీజన్‌ను కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.తాజా వివాదంపై తమిళ బిగ్‌బాస్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.