అమెరికాలో కాల్పుల కలకలం.. 9 మంది మృతి..

9 People Killed In Shooting In America , America, 9 People Killed, International News, Southern California, California State Senator Josh Baker, San Mateo CountySheriff

దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం రోజు రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో 11మంది మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ భాధాకరమైన సంఘటన మరువక ముందే మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు జరిగాయి.

 9 People Killed In Shooting In America , America, 9 People Killed, International-TeluguStop.com

సోమవారం సాయంత్రం సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణ ప్రాంతంలో ఒక పుట్టగొడుగుల పెంపకం వద్ద, ట్రాకింగ్ సంస్థ వద్ద కాల్పులు జరిగాయి.రెండు చోట్ల జరిగిన కాల్పులలో ఏడుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కాల్పులలో కొంత మందికి గాయాలు కూడా అయ్యాయి.అయితే కాల్పుల ఘటనకు కారణమైన ఒక అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అదే విధంగా అమెరికాలోని అయోవాలోని డేస్ మెయిన్స్ నగరంలో ఒక పాఠశాలలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు పాఠశాల విద్యార్థులు మరణించారు.ఒక ఉపాధ్యాయుడు గాయపడగా అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Telugu America, International, Sanmateo-National News

రెండు చోట్ల జరిగిన కాల్పుల ఘటనలపై కాలిఫోర్నియా రాష్ట్ర సెనెటర్ జోష్ బేకర్ మాట్లాడుతూ శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రంలో నలుగురు, ట్రక్కింగ్ వ్యాపారంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.కాల్పులకు కారణమైన వారిలో ఒక అనుమానిత వ్యక్తిని సోమవారం సాయంత్రం శాన్ మాటియో కౌంటీషెరీఫ్ కార్యాలయంలో అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన ట్విట్ ద్వారా వెల్లడించారు.

Telugu America, International, Sanmateo-National News

ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి చెందిన ఘటన మరువకముందే మూడు చోట్ల కాల్పులు జరగడం స్థానిక ప్రజలలో ఆందోళన కలిగిస్తుంది.

శాన్ మాటియో కౌంటి బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ ప్రెసిడెంట్ డేన్ ఫైన్ మాట్లాడుతూ శనివారం ఘటన మేము ఇంకా మరవకముందే వెంటనే మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకోవడం తమను తీవ్ర భాధకు గురి చేస్తుందని వెల్లడించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube