సాఫ్ట్ వేర్ రంగంలో వరుస లేఆఫ్ ల వల్ల ఎన్నో లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.విదేశాల్లో అందులోను ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.2022 నవంబర్ నుంచి ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో దాదాపు రెండు లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారని అమెరికా వార్తా పత్రిక వెల్లడించింది.గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యోగాల్లో కొత విధిస్తున్నారు.
మొత్తంగా తొలగింపుల్లో 30 నుంచి 40% వరకు భారతీయ ఐటీ నిపుణులు ఉండగా వారిలో అధికంగా హెచ్ వన్ బి,L1 వీసాలపై ఉద్యోగులు ఉన్నారు.సాధారణంగా అమెరికా వలస వెళ్లిన నిపుణులు H1B వీసా ద్వారా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.ఏదైనా కారణాల వల్ల వీసా దారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజులలోపు కొత్త ఉద్యోగం సాధించాల్సి ఉంటుంది.అప్పుడే అక్కడ ఉండటానికి వారికి అవకాశం ఉంటుంది.ఉద్యోగం సంపాదించని పక్షంలో వారి దేశాలకు వెళ్ళవలసి ఉంటుంది.
ప్రస్తుతం భారతీయ ఐటీ నిపుణులు ఇక్కడ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.దిగ్గజ ఐటి సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండగా రెండు నెలలలో కొత్త ఉద్యోగాలు తెచ్చుకోనేందుకు నాన్న తంటాలు పడుతున్నారు.అమెరికాలో సంకేతిక నైపుణ్య లేమిని భర్తీ చేసేందుకు గాను ఇండియా, చైనా నుంచి ప్రతి సంవత్సరం పదివేల మందిని అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి.
కంపెనీలు అన్నీ ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న ప్రస్తుత సమయంలో ఇప్పుడు ఉద్యోగులు కోల్పోయిన వారి కొత్త ఉద్యోగాలను సంపాదించడం సవాలుగా మారిందని సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్త అజయ్ జైన్ వెల్లడించారు.ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకొని హెచ్1B కార్మికుల పట్ల ఆయా కంపెనీలు ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు.
వారు తొలగింపు తేదీని కొంతకాలం పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు.