మన టాలీవుడ్( Tollywood ) లో ప్రతీ హీరో తమ కెరీర్ లో ఎదో ఒక సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తారు.ఆ సినిమా కోసం ఎన్ని కష్టనష్టాలు వచ్చినా భరిస్తారు.
అలా మాస్ మహారాజ రవితేజ ఎంతో నమ్మి ఇష్టం తో చేసిన సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’( Tiger Nageswara Rao ).నిజ జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ వంశీ( Director Vamsi ).ఈ చిత్రమే ఆయనకీ మొట్టమొదటి సినిమా, రవితేజ ఇది వరకు తన కెరీర్ లో ఎక్కువ శాతం కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడు.వాళ్ళు సక్సెస్ అయ్యి నేడు పెద్ద స్టార్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
అలా వంశీ కూడా ఈ చిత్రం తర్వాత స్టార్ డైరెక్టర్ అవుతాడు అంటూ రవితేజ రీసెంట్ ఇంటర్వ్యూస్ అన్నిట్లో చెప్పుకుంటూ వచ్చాడు.
ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ చూసిన తర్వాత రవితేజ చెప్పింది నిజమే, భవిష్యత్తులో ఇతను పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడు అని అందరూ అనుకున్నారు.అందులో ఎంత మాత్రం నిజం ఉందో అక్టోబర్ 20 వ తారీఖున తెలుస్తుంది.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయి లో జరగడం లేదనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ సినిమాకి గంటకి 400 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమా స్కేల్ కి ఇది చాలా తక్కువ ట్రెండ్ అనే చెప్పాలి.
ఈ చిత్రం లో రవితేజ( Ravi Teja ) రాబిన్ హుడ్ తరహా పాత్ర ని పోషించాడు.రవితేజ సినిమాలకు మొదటి నుండి అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త స్లో గానే ఉంటాయి.
ఎందుకంటే ఆయన ఊర మాస్ హీరో, కౌంటర్ దగ్గర అమ్ముడుపోయే టికెట్స్ ఎక్కువ ఉంటాయి.అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేకపోవచ్చు కానీ, టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా 10 కోట్ల రూపాయిల షేర్ ని మొదటి రోజే రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా తెలుగు తో పాటుగా తమిళం , కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.హిందీ ప్రొమోషన్స్ కోసం రవితేజ చాలా కష్టపడ్డాడు.దాదాపుగా అక్కడి అన్ని టాప్ చానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం తో పాటుగా, ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా పాల్గొన్నాడు.ఆ రేంజ్ లో ప్రొమోషన్స్ చేసారు కానీ, మరో మూడు రోజుల్లో సినిమా విడుదల పెట్టుకొని ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించకపోవడం విశేషం.
అసలు హిందీ లో 20 వ తారీఖున విడుదల ఉంటుందా లేదా అనేది ఇప్పటికీ అనుమానమే.దీనిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.