2021.. డ్యుయెల్ రోల్స్ తో ఆకట్టుకున్న హీరోలు ఎవరో తెలుసా?

ఈ ఏడాది పలువురు హీరోలు డ్యూయెల్ రోల్స్ చేసి ఆకట్టుకున్నారు.ఇప్పటి వరకు డబుల్ యాక్షన్ చేయని హీరోలు కూడా డ్యూయెల్ ధమాకా ఇచ్చారు.

 2021: Dual Roles In Tollywood , Ram Pothineni , Balakrishna, Nani, Dual Roles, T-TeluguStop.com

ఇంతకీ ఈ ఏడాది డ్యూయెల్ రోల్స్ చేసి జనాలను ఆకట్టుకున్న నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

*రామ్ పోతినేని

Telugu Dual Tollywood, Balakrishna, Dual, Nani, Ram Pothineni, Tollywood-Telugu

ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఇప్పటి వరకు డ్యూయెల్ రోల్ చేయలేదు.తాజాగా వచ్చిన రెడ్ సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నాడు.త‌మిళ సినిమా త‌డ‌మ్ తెరకెక్కిన ఈ మాస్ థ్రిల్ల‌ర్ మూవీలో సిద్ధార్ధ్, ఆదిత్య అనే క‌వ‌ల సోద‌రులుగా రామ్ నటించాడు.

రెండు పాత్ర‌ల్లోనూ ఆయన అద్భుతంగా నటించాడు.సంక్రాతి బరిలో నిలిచిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.జనాలు సైతం ఈ సినిమాను బాగా ఆదరించారు.

*బాల‌కృష్ణ

Telugu Dual Tollywood, Balakrishna, Dual, Nani, Ram Pothineni, Tollywood-Telugu

బాలయ్య ఇప్పటికే చాలా సినిమాలో డ్యూయెల్ రోల్స్ చేశాడు.అద్భుతంగా సక్సెస్ అయ్యాడు కూడా.తాజాగా ఈయన మరోసారి డ్యూయెల్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు.

తాజా హిట్ మూవీ అఖండలో కవల సోదరులుగా నటించారు.డ్యూయెల్ రోల్స్ చేయడంలో తనను కొట్టేవారే లేరని మరోసారి తేల్చి చెప్పాడు.

ఈ సినిమాలో అఘోరాగా, రైతుగా మంచి నటన కనబర్చాడు బాలయ్య.తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

*నాని

Telugu Dual Tollywood, Balakrishna, Dual, Nani, Ram Pothineni, Tollywood-Telugu

న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ ఏడాది డ్యూయెల్ రోల్స్ తో అదరగొట్టాడు.తాజాగా ఆయన నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో డ్యూయెల్ పాత్రలు పోషించి మెప్పించాడు.1970 నాటి బెంగాలీ యువకుడిగా, ఈ కాలపు తెలుగు యువకుడిగా బాగా నటించాడు.రెండు విభిన్న పాత్రల్లో అద్భుత శైలిలో యాక్టింగ్ లో ఇరగదీశాడు నాని.

డిఫరెంట్ టైమ్ లైన్స్ లో నడిచే పునర్జన్మ క్యారెక్టర్లలో నటిస్తూ మెప్పించాడు నాని.మొత్తంగా పలువురు హీరోలు ఈ ఏడాది ఢిపరెంట్ డ్యూయెల్ రోల్స్ చేసి జనాలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube