2021.. డ్యుయెల్ రోల్స్ తో ఆకట్టుకున్న హీరోలు ఎవరో తెలుసా?
TeluguStop.com
ఈ ఏడాది పలువురు హీరోలు డ్యూయెల్ రోల్స్ చేసి ఆకట్టుకున్నారు.ఇప్పటి వరకు డబుల్ యాక్షన్ చేయని హీరోలు కూడా డ్యూయెల్ ధమాకా ఇచ్చారు.
ఇంతకీ ఈ ఏడాది డ్యూయెల్ రోల్స్ చేసి జనాలను ఆకట్టుకున్న నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*రామ్ పోతినేని """/" /
ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఇప్పటి వరకు డ్యూయెల్ రోల్ చేయలేదు.
తాజాగా వచ్చిన రెడ్ సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నాడు.తమిళ సినిమా తడమ్ తెరకెక్కిన ఈ మాస్ థ్రిల్లర్ మూవీలో సిద్ధార్ధ్, ఆదిత్య అనే కవల సోదరులుగా రామ్ నటించాడు.
రెండు పాత్రల్లోనూ ఆయన అద్భుతంగా నటించాడు.సంక్రాతి బరిలో నిలిచిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
జనాలు సైతం ఈ సినిమాను బాగా ఆదరించారు.*బాలకృష్ణ """/" /
బాలయ్య ఇప్పటికే చాలా సినిమాలో డ్యూయెల్ రోల్స్ చేశాడు.
అద్భుతంగా సక్సెస్ అయ్యాడు కూడా.తాజాగా ఈయన మరోసారి డ్యూయెల్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు.
తాజా హిట్ మూవీ అఖండలో కవల సోదరులుగా నటించారు.డ్యూయెల్ రోల్స్ చేయడంలో తనను కొట్టేవారే లేరని మరోసారి తేల్చి చెప్పాడు.
ఈ సినిమాలో అఘోరాగా, రైతుగా మంచి నటన కనబర్చాడు బాలయ్య.తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది.
*నాని """/" /
న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ ఏడాది డ్యూయెల్ రోల్స్ తో అదరగొట్టాడు.
తాజాగా ఆయన నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో డ్యూయెల్ పాత్రలు పోషించి మెప్పించాడు.
1970 నాటి బెంగాలీ యువకుడిగా, ఈ కాలపు తెలుగు యువకుడిగా బాగా నటించాడు.
రెండు విభిన్న పాత్రల్లో అద్భుత శైలిలో యాక్టింగ్ లో ఇరగదీశాడు నాని.డిఫరెంట్ టైమ్ లైన్స్ లో నడిచే పునర్జన్మ క్యారెక్టర్లలో నటిస్తూ మెప్పించాడు నాని.
మొత్తంగా పలువురు హీరోలు ఈ ఏడాది ఢిపరెంట్ డ్యూయెల్ రోల్స్ చేసి జనాలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు.
డాకు మహారాజ్ మూవీకి సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నిర్మాత నాగవంశీ క్రేజీ కామెంట్స్ వైరల్!