జనసేన అధినేత పవన్ కళ్యాణ్( pavan kalyan )రాజకీయంగా బలపడేందుకు వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం పెంచేందుకు వారాహి యాత్ర చేస్తున్నారు.ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండడం, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుంచి ఎక్కువ సీట్లు జనసేనకు దక్కుతాయి అనే అంచనాతో ఈ రెండు జిల్లాల పైన ప్రత్యేకంగా పవన్ ఫోకస్ పెట్టారు.
ఈ సందర్భంగా పవన్ చేస్తున్న ప్రసంగాలు కొన్ని కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి.ముఖ్యంగా కులాల అంశంతో పాటు, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పైన పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
ముఖ్యంగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ బాగా బలపడింది.వైసిపి ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారానే ప్రజలకు అందుతున్నాయి.
అన్ని సేవలు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకి వస్తుండడం, ఇక అన్ని అంశాల పైన వాలంటీర్లు డేటా కలెక్ట్ చేస్తుండడం వంటి వ్యవహారాలపై పవన్ సంచలన కామెంట్స్ చేశారు.ఏపీలో ఉమెన్ ట్రాపింగ్ జరగడానికి కారణం వాలంటీర్లు ఇస్తున్న డేటానే కారణమని, అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే దేశం ఆగిపోతుందా ? మిగతా రాష్ట్రాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే అన్ని పనులు జరుగుతున్నాయని, ఏపీలో ఈ వ్యవస్థ అవసరమా అంటూ పవన్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
పవన్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు( volanteers ) పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వినిపిస్తున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి హైకోర్టులో జరిగిన విచారణపై ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని ట్వీట్ చేశారు.వైసీపీ వాలంటీర్లు ప్రజల డేటా ఉల్లంఘించడంపై ఏపీ హైకోర్టు.
వైఎస్ జగన్ అధికారిక పెగాసస్ వ్యవస్థ రాష్ట్ర ఖజానా ద్వారా స్పాన్సర్ చేయబడింది” అంటూ ట్వీట్ చేశారు.ఇదిలా ఉంటే, పవన్ చేసిన వ్యాఖ్యలు టిడిపి కి ఇబ్బందికరంగా మారాయి.
గతంలో వాలంటీర్ వ్యవస్థ పై టిడిపి అధినేత చంద్రబాబు కామెంట్ చేశారు.అయితే దాని కారణంగా జరిగిన నష్టాన్ని గుర్తించి టిడిపి అధికారంలోకి వస్తే, వాలంటీర్లకు జీతాలు పెంచుతామని, వారి ఉద్యోగాలకు భరోసా కల్పిస్తామని ప్రకటించారు.
ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉన్న టిడిపి( TDP ) పవన్ చేస్తున్న వ్యాఖ్యల పైన స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడడం, పదేపదే ఈ వ్యవహారంపై స్పందించాల్సిందిగా ఎక్కడికక్కడ టిడిపి నేతలపైన ఒత్తిడి పెరుగుతోంది.ప్రస్తుతానికి పవన్ చేసిన వ్యాఖ్యలపై మౌనంగా ఉన్న చంద్రబాబు దీనిపై ఏ విధంగా స్పందించాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయారట.అసలు పవన్ ద్వారా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయించి వాలంటీర్ వ్యవస్థ ను రద్దు చేయించే ప్రయత్నాలు, ప్రజల్లోనూ ఆందోళన రేకెత్తించే విధంగా చేస్తున్నారనే అనుమానాలు జనంలో మొదలయ్యాయి.దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ వ్యభారం తమకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అనే భయం టిడిపిలో కనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తే వాలంటీర్ ల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది.దీంతో ఈ వ్యవహారంపై స్పందించేందుకు టీడీపీ తర్జనభర్జన పడుతోంది.