టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న( Tamannaah Bhatia ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories) తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ భామ త్వరలోనే చిరంజీవి ‘భోళా శంకర్’ ( Bholaa Shankar ), రజినీకాంత్ ‘జైలర్’ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ రెండు సినిమాలు ఆగష్టులో ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి.
దీంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాల నుంచి వరుసగా సాంగ్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా తమన్నా ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఓ అభిమాని తమన్నతో కలిసి డాన్స్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.రజనీకాంత్ తమన్నా నటించిన జైలర్ సినిమా( Jailer )లో నుంచి తాజాగా ‘వా నువు కావాలయ్యా’ సాంగ్ ని రిలీజ్ చేశారు.
అనిరుద్ (Anirudh) సంగీతంలో వచ్చిన ఈ పాటకు జానీ మాస్టర్ (Jani Master) కొరియోగ్రఫీ అందించారు.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే తమన్న ముంబై ఎయిర్ పోర్టు( Mumbai Airport )లో కనిపించడంతో ఓ అభిమాని ఏకంగా కావాలయ్యా సాంగ్ కి తనతో కలిసి డాన్స్ వేయాలంటూ కోరాడు.అందుకు తమన్నా కూడా అంగీకరించడంతో అభిమాని తమన్నాతో కలిసి డాన్స్ వేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అంతేకాకుండా తమన్నా ఇలా డాన్స్ చేయడంతో ఈ సినిమాకి కూడా భారీగా ప్రమోషన్ వచ్చిందంటూ పలువురు ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.