తెలంగాణా బిల్లును కాల్చేసిన జగన్ పార్టీ ఎమ్మెల్యే లు

అసెంబ్లీలో బిల్లు భగభగలు మొదలయ్యాయి.తీవ్ర ఉత్కంఠ, ఉద్వేగాల నడుమ కొద్ది సేపటి క్రితం మొదలయిన శాసనసభ సమావేశాలలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్-2013 (తెలంగాణా బిల్లు)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించగానే తెలంగాణా ప్రాంత సభ్యులలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.

 Ysr Congress Mlas Burnt Telanagana Bill-TeluguStop.com

మొదట సీమాంధ్ర సభ్యుల ఆందోళన తీవ్రం అవడంతో సభను అరగంట సేపు వాయిదా వేసారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును స్పీకర్ సభలో ప్రవేశపెట్టిన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టి.బిల్లును చించేసి నిప్పు పెట్టారు.తొలుత టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ఎమ్మెల్యేలు టి.బిల్లును చించేశారు.ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్యేలు టి.బిల్లుకు నిప్పు పెట్టారు.దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ముసాయిదా బిల్లును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు దగ్ధం చేస్తుండటంతో తెరాస పరకాల ఎమ్మెల్యే కుర్చీ విసిరి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో జగన్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కిందపడిపోయారు

స్పందించిన పోలీసులు, ఇతర సభ్యులు ఇరువురునీ వారించారు.అనంతరం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.

ఈ చర్య తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.ఇలాంటిం చర్యలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube