అంబేద్కర్ జయంతి సందర్భంగా లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గొప్పదనాన్ని వివరించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తానని చెప్పి.తెలంగాణ వచ్చాక ఆయనే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు అని విమర్శించారు.
టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితులకు 3 ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు ఆ వాగ్దానాన్ని కూడా గాలికొదిలేశారు అని పేర్కొన్నారు.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విషయంలో అడ్డురాని కరోనా నిబంధనలు.
అంబేద్కర్ జయంతి వేడుకలకు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ జయంతి వేడుకలకి అడ్డు వస్తాయా అంటూ విమర్శించారు.దీన్ని బట్టి కేసీఆర్ కి దళితులు అంటే ఎంత ప్రేమో అన్న తరహాలో సెటైర్లు వేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత ఉపముఖ్యమంత్రి రాజయ్య పై చిన్న ఆరోపణలు వస్తే క్షణం ఆలస్యం చేయకుండా పదవి నుంచి తొలగించిన కేసీఆర్.మంత్రి మల్లారెడ్డి పై ఎన్నో ఆరోపణలు వస్తున్నా ఆయన చెవికి వినపడటం లేదా అంటూ ప్రశ్నించారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ పై చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
.