కోడలి రాజకీయం నమ్మేది ఎంతమందో ? 

ఆంధ్రకు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ ఎలా పెడతారు అంటూ ప్రశ్నించిన వారికి గట్టిగానే సమాధానం చెప్పేశారు.తాను తెలంగాణ కోడలిని అని, పార్టీ పెట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయనే డైలాగుతో విమర్శలకు చెక్ పెట్టేసారు.

 Ys Sharmila Faced So Many Problems In Telangana , Trs, Bjp, Congress, Ysrcp, Jag-TeluguStop.com

ఇక సొంతంగా పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు, దాని విధివిధానాలు రూపొందించే పనిలో షర్మిల చాలా బిజీగా ఉన్నారు.  తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అందరినీ ఆమె పలకరిస్తున్నారు.

ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీని జనాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే విషయంపైనా చర్చిస్తున్నారు.అసలు తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల కంటే, మన పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలంటే ఏం చేయాలనే విషయంపైనా అందరి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

త్వరలోనే పార్టీ పేరు ప్రకటించడం తథ్యం అయిపోయిన నేపథ్యంలో, ఇప్పటికే తెలంగాణలో రాజకీయంగా ఎటువంటి అవకాశం లేక ఇబ్బంది ఎదుర్కొంటున్న నాయకులు, గతంలో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులు, కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ లలో సరైన ప్రాధాన్యం తమకు దక్కడం లేదని భావిస్తున్న కొంతమంది నాయకులు, షర్మిల పార్టీ పై ఆసక్తిగా ఉన్నారు.

అసలు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడం జగన్ కు ఇష్టం లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, షర్మిల ఒంటరిగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళగలరు అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇప్పటి కే టిఆర్ఎస్ ,బిజెపిలు పోటాపోటీగా అధికారం కోసం తలపడుతున్నాయి.ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభావం తెలంగాణలో ముగిసింది అనుకుంటున్నా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏదోరకంగా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు.

ఇప్పుడు ఈ మూడు పార్టీలను అధిగమించి తెలంగాణలో షర్మిల పార్టీ అధికారంలోకి రావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు.గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు బలమైన కార్యకర్తల అండదండలు, వ్యూహాత్మక ఎత్తుగడ వేయగల రాజకీయ నిపుణులు షర్మిల పార్టీకి అవసరం.

Telugu Congress, Jagan, Sharmila, Ys Rajashekhara, Ysrcp-Telugu Political News

అయితే షర్మిల పార్టీ పేరు ప్రకటించగానే ఎంతమంది అటువంటి నాయకులు వచ్చి చేరుతారు అనేది సందేహమే.తాను తెలంగాణ కోడలిని అని ఎంత గట్టిగా షర్మిల చెప్పుకున్నా, ఆమె రాజకీయం పై ఆంధ్రా ముద్ర స్పష్టంగా ఉంటుంది.అలాగే షర్మిల పార్టీలోకి టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి టికెట్ లు దక్కని నాయకులు మాత్రమే వచ్చి చేరే అవకాశం ఉంటుంది.దీంతో పాటు తెలంగాణ వైసీపీ నాయకులు, మరికొంత మంది సన్నిహితులు తప్ప టీఆర్ఎస్, బీజేపీ పార్టీల స్థాయిలో షర్మిల తెలంగాణలో పట్టు సాధిస్తారా అంటే అది సందేహమే.

రాజకీయంగా ఎన్నో సవాళ్లు, మరెన్నో ఇబ్బందులు షర్మిల ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

అసలు ఏపీలో వైఎస్ చరిష్మా, జగన్ కు జనాల్లో మంచి ఆదరణ ఉన్నా, 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది.

షర్మిలకు అంతకంటే ఇబ్బందులు ఎన్నో చూట్టిముట్టేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పుడు జై తెలంగాణ అంటూ షర్మిల నినాదం వినిపిస్తున్నా, తెలంగాణ ఉద్యమం సమయంలో ఎందుకు ఆ నినాదాన్ని వినిపించలేదు అనే ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube