ప్రశ్నించారో అంతే సంగతులు ? ఇట్లు మీ జగన్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వేరు, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ వేరు.జగన్ లో చాలా మార్పు వచ్చేసింది.

 Ys Jagan, Ap Cm, Chittoor, Coronavirus, Nimmagadda Ramesh, Venkat Ramireddy-TeluguStop.com

అసలు జగన్ ఎంత గా మారిపోతాడు అని ఎవరు ఊహించలేదు అంటూ ఆయన సన్నిహితులు చాలా గొప్పగానే చెప్పుకుంటూ వస్తున్నారు.అయితే వాస్తవంలోకి వచ్చేసరికి జగన్ ప్రవర్తనలో మార్పు ఏ మాత్రం కనిపించడం లేదని, అదే అహంకారం, అదే అసహనం ఆయనలో కనిపిస్తున్నాయని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంది.కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ఈ సమయంలో జగన్ ఇంకా తన మొండి పట్టుదలతో నే ఉంటున్నారు.

ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పైన, వాటిని కట్టడి చేసే విధానం పైన, ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేసే విధంగా మీడియా సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా, జగన్ మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

ఇక మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా జగన్ అభాసు పాలయ్యారు.

ఏపీలో తాను నియమించిన వాలంటీర్ల వ్యవస్థ కారణంగానే రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యాయని జగన్ గొప్పగా చెబుతున్నారు.అయితే ఆ తరువాత కేసుల సంఖ్య ఎక్కువవడం జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లు, ఇతర సిబ్బందికి మాస్కులు, ఇతర రక్షణ సామాగ్రి ఇచ్చే విషయంలోనూ జగన్ ప్రభుత్వం విమర్శల పాలైంది.మాస్కులు ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, అవి అన్ని ఆసుపత్రులకు అందలేదనేది వాస్తవం.

దీనికి సంబంధించి నర్సీపట్నంలో ఓ ప్రభుత్వ డాక్టర్ చెప్పిన విషయాలు బాగా వైరల్ అవ్వడం, ప్రభుత్వం పై విమర్శలు రావడంతో ఆయన పై తెలుగుదేశం పార్టీ ముద్ర వేసి వెంటనే సస్పెండ్ చేశారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న వెంకటరామిరెడ్డి ఓ సెల్ఫీ వీడియో మాట్లాడుతూ, తమకు ప్రభుత్వం నుంచి కనీసం ఏ సహాయం అందడం లేదని, ఒక్క రూపాయి కూడా రావడం లేదంటూ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు.

వెంటనే ఆయనను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఇక కరోనా వైరస్ కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నాము అంటూ ప్రకటించి వైసీపీ ప్రభుత్వం ఆగ్రహానికి గురైన ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ ఇదే విధంగా జగన్ ప్రభుత్వం అభాసుపాలైంది.

అసలు ఏపీలో కరోనా లేదని దాని కారణంగా చూపిస్తూ ఎన్నికలు వాయిదా వేయడాన్ని వైసిపి తప్పు పట్టింది.అంతేకాకుండా ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిని అందుకే ఆ పార్టీకి మేలు జరిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పై కుల దూషణకు కూడా వైసిపి నాయకులు, మంత్రులు దిగారు.

స్వయంగా ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించి మరీ నిమ్మగడ్డ తీరును తప్పు పట్టారు.ఇప్పుడు ఆయనను ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకుంటే వెళ్తే ప్రభుత్వం తీరును ఎవరూ ప్రశ్నించినా, వారికి శంకరగిరి మాణ్యాలు తప్పు అన్నట్టుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube