తెలంగాణలో(Telangana) రాజకీయ రణరంగం మొదలైందని చెప్పవచ్చు.ఇప్పటికే బీఆర్ఎస్(BRS) ముందస్తుగా టికెట్లు ప్రకటించి ప్రచారంలో మునిగిపోయింది.
కాంగ్రెస్ పార్టీ కూడా 100 సీట్లు పూర్తిగా ప్రకటించింది.ఇంకో 19 సీట్లు రిజర్వులో పెట్టింది.
బిజెపి సగం సీట్లు ప్రకటించింది.ఈ విధంగా మూడు పార్టీలు రాజకీయ రణరంగంలోకి దూకేశాయి.
ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు దూసుకెళ్తున్నాయి.కానీ ఈసారి కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ మధ్య ఎక్కువ పోటీ ఉంటుందని బిజెపి మూడవ స్థానంలోకి వస్తుందని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.
మరి బిజెపి ఈ విధంగా దిగజారి పోవడానికి కారణం ఏంటి.ఆ వలస నేతల వల్లే బిజెపి(BJP) ఇలా తయారయిందా.ఆ వివరాలు ఏంటో చూద్దాం.తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్(Bandi Sanjay) వచ్చిన తర్వాత ఒక ఊపు ఊపింది.
బీఆర్ఎస్ కు(BRS) ప్రత్యన్మయం బిజెపి అనే విధంగా తయారయింది.ఈటల రాజేందర్(Etela Rajender), రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy), విజయశాంతి(Vijaya Shanti), వివేక్(Vivek) వంటి పెద్ద లీడర్స్ బిజెపి పార్టీలోకి వెళ్లారంటే ఆ పార్టీ ఏ స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.
మరి అలాంటి బీజేపీ ఎన్నికల సమయం వచ్చేసరికి పాతాళానికి పడిపోయింది.దీనికి ప్రధాన కారణం ఆ వలస నాయకులే అని బిజెపి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి బిజెపి(BJP) తీర్థం పుచ్చుకున్న తర్వాత గొడవలు మొదలయ్యాయి.బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తొలగించే పరిస్థితి ఏర్పడింది.చివరికి మోడీ బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డిని(Kishan Reddy) అధ్యక్షుడిగా పెట్టారు.
దీంతో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.ఈ క్రమంలోనే బిజెపిలో ఉంటే పని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ హస్తం గూటికి చేరుకున్నారు.ఈటల రాజేందర్ ఉన్న నాయకులను పట్టుకొని ఎటు కాకుండా అయిపోయారు.
ఈ విధంగా ఎంతో గ్రాఫ్ సంపాదించుకున్న బిజెపి అధిష్టానం కోవర్ట్ లను నమ్మి విజయానికి దగ్గరగా తీసుకువచ్చిన అధ్యక్షుడుని తొలగించి తప్పు చేసిందని బిజెపి కార్యకర్తలు అంతా ఆందోళన చెందుతున్నారు.