కేజిఎఫ్ స్టార్ బర్త్ డే స్పెషల్.. ఈసారి మరింత డేంజర్ గా రాఖీ భాయ్ ..

కన్నడ స్టార్ యష్ ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.ఈ సందర్భంగా ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 నుండి ఒక అప్డేట్ విడుదల చేసారు మేకర్స్.

 Yash Looks Deadly In Birthday Special Poster Of Kgf Chapter 2, Kgf , Prashanth-TeluguStop.com

కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ సినిమాతోనే యష్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సినిమా కేజీఎఫ్.కేజీఎఫ్ హిట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ పేరు, యష్ పేరు ప్రపంచం అంతా మారుమోగి పోయింది .కేజిఎఫ్ చాప్టర్ 1 అంత పెద్ద హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో రాఖీ భాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ ఇప్పుడు కెజిఎఫ్ 2 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు.

కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం యష్ ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.ఏప్రిల్ 14, 2022 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.తాజాగా ఈ సినిమా నుండి యష్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ ఆసక్తిగా ఉంది.

ఈ పోస్టర్ లో యష్ సీరియస్ గా కనిపిస్తున్నాడు.అంతేకాదు ఆయన ముందు ”కజిన్, డేంజర్ ఎహెడ్” అనే బోర్డు కూడా ఉంది.మా రాఖీ భాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ ద్వారా విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేయడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించగా విజయ్ కిరాగండూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube