భర్త మద్యం తాగడం కోసం డబ్బులు అడుగుతున్నాడని భార్య ఏకంగా...

ప్రస్తుత కాలంలో కొందరు మద్యానికి బానిసలై కట్టుకున్న వారిని మరియు కన్నవారిని నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాలను కష్టాల పాలు చేస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన భార్యను నిత్యం మద్యం డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఆమె ఏకంగా తలపై బలంగా గాయపరచి హత్య చేసిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని బ్రహ్మపుర నగరంలో చోటు చేసుకుంది.

 Married Women, Odisha, Crime News, Liqueur Consumption-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలోని ఓ వీధిలో  బనమాలి, సునీత అనే ఇద్దరు దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసముంటున్నారు.అయితే ఇందులో బనమాలి జులాయిగా తిరుగుతూ నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తూ ఉండేవాడు.

ఎన్నిమార్లు తన భార్య మద్యం సేవించద్దని చెప్పినప్పటికీ బనమాలి నిత్యం మద్యం సేవిస్తూ భార్య మాటలను పెడచెవిన పెట్టేవాడు.అయితే తాజాగా మరోమారు తన భార్యని బనమాలి మద్యం సేవించేందుకు డబ్బులు కావాలని వేధించాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద తగువు కూడా జరిగింది.అయితే ఈ తగువులో సునీత తన భర్త తలపై బలంగా గాయపరిచింది.

దీంతో ఉన్నట్లుండి బనమాలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఇది గమనించిన టువంటి స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.

అలాగే పోలీసులకు సమాచారం అందించడంతో భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి వైద్యులు పోలీసులకు ఈ విషయం గురించి చెప్పగా, సునీత ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించింది.దీంతో ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

అలాగే సునీత పిల్లలను దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ సంరక్షణాలయనికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube