రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ అధికార ప్రతి వినూత్న కార్యక్రమాలతో జనాల్లో ఆదరణ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.రెండు రోజుల క్రితం జరిగిన వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు , కీలక నాయకుల సమావేశంలో జగన్ ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని, ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకుంటే రాబోయే ఎన్నికల్లో టికెట్ కు ఎటువంటి డోకా ఉండదని ప్రకటించారు.పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలని , జనాల్లో ఆదరణ పెంచుకునే విధంగా ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలు వల్ల వారికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని వివరంగా చెప్పాలని సూచించారు.
ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా ఇప్పుడు ‘ జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్( maa nammakam nuvve jagan ) ‘ పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా వైసిపి ప్లాన్ చేస్తోంది.సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు , ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహసారథులు ఇలా మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మందితో క్షేత్రస్థాయిలో క్రియాశీలక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ వ్యవస్థ ద్వారానే జనాలకు వైసిపి ప్రభుత్వం( YSRCP ) చేస్తున్న మంచిని వివరించాలని నిర్ణయించుకున్నారు.ఈనెల 7న ప్రారంభమై ఈ కార్యక్రమం 20వ తేదీ వరకు కొనసాగుతుంది.దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు , నియోజకవర్గ ఇన్చార్జి ల ఆధ్వర్యంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని 1.60 కోట్ల ఇళ్లకు కన్వీనర్లు , గృహసారథులు వెళ్లి ఆ కుటుంబాల ప్రజలతో మమేకం అవుతారు.2.6 లక్షల మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొంటారు.అప్పటి టిడిపి ప్రభుత్వం, ఇప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించబోతున్నారు.’ పీపుల్స్ సర్వేలో భాగంగా ప్రతి ఇంట్లోనూ ఐదు ప్రశ్నలు అడిగి , వారు చెప్పిన సమాధానాలను ‘ ప్రజా మద్దతు పుస్తకం ‘ లో నమోదు చేసి రసీదును ఇవ్వబోతున్నారు.అలాగే జగన్ ప్రభుత్వం కు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 8296082960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని, అయా కుటుంబ సభ్యులను గృహసారథులు కోరుతారు.
ఈ విధంగా మిస్డ్ కాల్ ఇచ్చిన నిమిషంలో పై వారికి సీఎం జగన్( CM Jagan ) సందేశం తో కూడిన ఐ.వి.ఆర్.ఎస్ కాల్ వస్తుంది .ఈ విధంగా ఎన్నికల వరకు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోనే ఉంటూ ప్రజల ఆదరణ పొందే విధంగా వైసిపి వ్యూహాత్మకంగా వినూత్న కార్యక్రమాలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.