ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాసిన లేఖపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు.ఇళ్ల స్థలాల్లో రూ.35 వేల కోట్ల స్కాం జరిగిందని ఆధారాలు చూపిస్తారా అని ప్రశ్నించారు.
రూ.35 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రధాని మోదీ అడిగితే చెప్పగలరా అని డిప్యూటీ సీఎం కొట్టు ప్రశ్నించారు.ఏపీలో సీఎం జగన్ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు.
చంద్రబాబు హయాంలో జరిగిన స్కాంలలో పవన్ కల్యాణ్ కూడా వాటా ఉందని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వంపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.అయితే ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో విచారణ చేయించాలని పవన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.