ప్రస్తుత కాలంలో కొందరు తాత్కాలిక ఆనందాల కోసం పక్కదారులు పడుతూ తమ అనుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తూ కష్టాల పాలవుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన శారీరక సుఖాల కోసం కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ పరాయి మహిళలతో సంబంధాల పెట్టుకొని తన భార్యకి అన్యాయం చేయాలని చూసిన ఘటన బతుకు జట్కా బండి కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే గణేష్ అనే వ్యక్తి స్థానిక ఉన్నటువంటి 12 సంవత్సరాలు కలిగినటువంటి ఓ మైనర్ బాలికను బాల్య వివాహం చేసుకున్నాడు.అయితే పెళ్లయిన కొత్తలో ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళు.
అయితే కొంతకాలం తర్వాత గణేష్ తన స్నేహితుడు ద్వారా పరిచయమైనటువంటి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.దీంతో ఆ మహిళ గణేష్ భార్యను సూటిపోటి మాటలతో వేధించేది.
అంతేగాక తన భర్తతో ఉన్నటువంటి సంబంధం కారణంగా తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది.దీంతో గణేష్ తల్లిదండ్రులు కొంత నగదును ముట్టజెప్పి ఇకపై తమ కొడుకు జోలికి రావద్దు అంటూ హెచ్చరించారు.
అయినప్పటికీ గణేష్ తో ఆ మహిళ చనువుగానే ఉండేది.ఈ విషయంపై గణేష్ భార్య అతడిని నిలదీసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది.దీంతో రేణుక తన బంధువుల సహాయంతో బతుకు జట్కా బండి కార్యక్రమానికి న్యాయం కోసం వచ్చింది.అయితే సమస్యను విన్నటువంటి వ్యాఖ్యాత రోజా గణేష్ ను ఈ కార్యక్రమానికి పిలిపించి మాట్లాడింది.
ఇందులో భాగంగా ఆడపిల్లలంటే ఆటబొమ్మలు కాదని, తాత్కాలిక సుఖాలకి అలవాటుపడి కట్టుకున్న వారికి ద్రోహం చేయకూడదని సర్దిచెప్పి ఇద్దరిని కలిపింది.అలాగే భవిష్యత్తులో గణేష్ భార్య రేణుకను కష్టపడితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
దీంతో గణేష్ కూడా తన భార్య ని బాగా చూసుకుంటానని అందరి సమక్షంలో చెప్పి తన వెంట తీసుకెళ్లాడు…