తల్లి అక్రమ సంబంధం బయట పెట్టిన కవల పిల్లలు... ప్రపంచంలోనే వింతైన సంఘటన

అక్రమ సంబంధాలు అనేవి ప్రతి చోట చాలా కామన్‌ అయ్యాయి.కొందరు తమ అక్రమ సంబంధాలు ఎవరికి తెలియవు అని గుట్టుగా వ్యవహారం నడుపుతుంటారు.

 Wife Cheating Explosed By Her Twins Babys-TeluguStop.com

కాని ఆ వ్యవహారం ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక రూపంలో బయటకు వస్తుందనే విషయం మాత్రం వారు ముందే పసిగట్టలేక పోతున్నారు.తాజాగా చైనాలో ఒక మహిళ తన భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో వ్యవహారం నడిపించేది.

కొన్నాళ్ల పాటు వారిద్దరి వ్యవహారం సాగింది.పిల్లలు అయిన తర్వాత ప్రియుడి నుండి ఆమె దూరంగా ఉండాలని భావించింది.

అయితే అనూహ్యంగా పుట్టిన పిల్లలు ఆమె అక్రమ సంబంధంను బయట పెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…


చైనాలోని ఒక మహిళ ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది.కవల పిల్లలు పుట్టినందుకు ఆ తల్లి చాలా సంతోషించింది.అయితే ఆమె భర్తకు మాత్రం ఏదో అనుమానం కొట్టింది.

ఇద్దరు పిల్లలు ఒకేలా లేకపోవడం అతడి అనుమానంకు కారణం.ఇద్దరు కవలలు అయినప్పుడు సేమ్‌ టు సేమ్‌ ఉండాలి.

కాని ముక్కు, చెవులు, కళ్లు ఇలా అన్ని కూడా విభిన్నంగా ఉండటంతో ఆయన అనుమానం పెద్దది అయ్యింది.రోజులు గడుస్తున్నా కూడా ఆ తేడాలో అతడికి క్లీయర్‌గా తెలియడం ప్రారంభం అయ్యింది.

దాంతో అతడు ఆ పిల్లలిద్దరికి కూడా టెస్టులు చేయించాడు.అందులో భాగంగా డీఎన్‌ఏ టెస్టు కూడా చేయించాడు.

అతడు అనుమానించిందే నిజం అయ్యింది.ఆ ఇద్దరు కూడా ఒక్క డీఎన్‌ఏను కలిగి లేరు.

అందులో ఒక పాప మాత్రమే అతడి డీఏన్‌ఏను కలిగి ఉండగా మరో పాపాయి డీఏన్‌ఏ వేరుగా ఉంది.ఆ విషయాన్ని ఆమెను నిలదీయగా ఆమె మొదట ఒప్పుకోలేదు.ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి అసలు మ్యాటర్‌ ఏంటీ అంటూ కాస్త గట్టిగా అడగడంతో అన్ని విషయాలు బయటకు చెప్పేసింది.తనకు అప్పట్లో ఒక ప్రియుడు ఉండేవాడని, అప్పుడప్పుడు అతడు ఇంటికి వచ్చాడని, అతడితో శృంగారం కూడా చేశాను అని చెప్పుకొచ్చింది.

దాంతో ఆ రెండవ బిడ్డకు అతడే తండ్రి అని తేలిపోయింది.వైధ్య శాస్త్రంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి.

భర్తతో మరియు ప్రియుడితో ఆమె ఒకే రోజులో లేదంటే కొన్ని గంటల తేడాలో శృంగారంలో పాల్గొన్న సమయంలో ఇది జరిగి ఉంటుందని, ఇద్దరి శుక్రకణాలు కూడా ఆమెకు కవల పిల్లలు పుట్టేలా చేశాయని, ప్రపంచంలోనే ఇది వింతైన సంఘటనగా వైధ్యులు చెబుతున్నారు.అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంటా అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube