భారత దేశ సంస్కృతికి ప్రపంచదేశాల సంప్రదాయాలకు ఎన్నో తేడాలు ఉంటాయి.విభిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిసిన ఏకైక దేశం మన భారతదేశం.
మన సంప్రదాయాలకు భిన్నంగా వేరే దేశాల్లో సంప్రదాయాలు, జీవన విధానం, నాగరికతలు ఉంటాయి.దక్షిణ సుడాన్ దేశంలో కూడా విభిన్న సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తుంటారు.
దక్షిణ సుడాన్ దేశంలోని కొన్ని గిరిజన జాతుల్లో విచిత్రమైన సంప్రదాయాలు పాటిస్తుంటారు.ఏ తల్లిదండ్రులైన తమ అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు వరుడి ఆరోగ్యం చూసి వివాహం చేస్తుంటారు.
కానీ డింకా, న్యూర్ తెగల్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.తల్లిదండ్రులు తమ కూతుళ్లను రేపోమాపో చనిపోయే ముసలివాళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తారు.
దీని వెనుక ఓ కథ ఉంది లేండీ.ముసలివాళ్లకు ఇచ్చి పెళ్లి చేయడం వల్ల మహిళలు ఆరోగ్యంగా ఉంటారని అక్కడి వాళ్ల నమ్మకం.
అందుకే ముసలివాళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు.పెళ్లై భర్త చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉండే భర్త తమ్ముడు లేదా అన్నతో కలిసి సంసారం చేయాలి.
భర్త చనిపోయిన మహిళకు (విడో) ఆ తెగల్లో ఎక్కువగా గౌరవం లభిస్తుందట.మరో తెగలో మహిళలకు పెళ్లైన తర్వాత కనీసం ఇద్దరు పిల్లలు జన్మనివ్వాలి.
అలా జరగకపోతే భర్త తన భార్యకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటారు.