అందరూ హీరోయిన్స్ ది ఒ కదారైతే ఆ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం మరో దారిలో వెళ్తున్నారు.తమ రూటు సపరేటు అంటూ మిగతా హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అంటే త్రిష ( Trisha ) మరియు అనుష్క.( Anushka ) వీరిద్దరూ మిగతా హీరోయిన్స్ మాదిరిగా ఫ్యాన్ ఇండియా సబ్జెక్ట్స్ లేదా బాలీవుడ్ లో నటించాలనే కోరిక లేకుండా కేవలం సౌత్ ఇండియా కు మాత్రమే పరిమితం అయిపోతున్నారు.
వీరిద్దరూ తీసే సినిమాల పద్ధతి చూస్తే కావాలని చేస్తున్నారా లేదా ఇద్దరు మాట్లాడుకుని చేస్తున్నారా అన్నట్టు అనుమానం రాక మానదు.ఈ ఇద్దరు హీరోయిన్స్ రూట్స్ సౌత్ లోనే ఉన్నాయి కాబట్టి సినిమాలు కూడా సౌత్ ఇండియాలోనే తీయాలి అనుకుంటున్నారు.
కొంతమంది నిర్మాతలు వారిని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి అడిగితే వారి దగ్గర నుంచి ఖచ్చితంగా ఇలాంటి సమాధానమే వస్తుందంట.

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక అనుష్క మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు.అలాగే మంచి ప్రాజెక్ట్ పై కూడా ఫోకస్ పెట్టింది అనుష్క.నవీన్ పోలిశెట్టి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mr Polishetty ) అనే సినిమాలో నటించి సక్సెస్ అందుకుంది.
మలయాళంలో కూడా ఒక సినిమాలో నటిస్తోంది అనుష్క.ఇది కాకుండా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో( Director Krish ) ఒక సినిమా చేయడానికి ఇప్పటికే పచ్చ జెండా ఊపింది.
మరి ఒకటికి రెండు సినిమాలు కమిట్ అవుతుంది కానీ బాలీవుడ్ నుంచి మాత్రం ఎలాంటి సినిమాలు ఒప్పుకోవడం లేదట ఈ అమ్మడు.అందుకు సరైన కారణాలు తెలియదు కానీ పూర్తిగా సౌత్ ఇండియా కే పరిమితమైపోయింది అనుష్క.

ఇక అనుష్క బాటలోనే త్రిష కూడా కొనసాగుతుంది.వయసు పెరుగుతున్న కొద్ది అందాన్ని పెంచుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈమె కూడా పూర్తిగా సౌత్ ఇండియాకే పరిమితమైపోతుంది.తెలుగు మరియు తమిళ భాషలో అనేక సినిమాల్లో నటించేందుకు ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలీవుడ్ కి( Bollywood ) మాత్రం నో అంటుంది.
అనుష్క, త్రిష ఇలా ఇద్దరు హీరోయిన్స్ సీనియర్స్ అయినప్పటికీ సినిమాల విషయంలో జోరు పెంచుతున్నారు కానీ బాలీవుడ్ కి మాత్రం ఎందుకు నో చెబుతున్నారనేది అర్థం కావడం లేదు.అయితే కొంతమంది చెప్పే విషయం ఏమిటంటే వీరికి అసలు బాలీవుడ్ ఆఫర్స్ రావడం లేదు అంటున్నారు.
ఇందులో నిజానిజాలు ఏంటో ఖచ్చితంగా తెలియదు.