మన దేశంలో బస్సు ప్రయాణాలు కంటే రైలు ప్రయాణాలే తక్కువ ఖర్చుతో అయి పోతాయి.అందుకే పేద, మధ్య తరగతి ప్రజలు రైలు లోనే ఎక్కువుగా ప్రయాణిస్తూ ఉంటారు.
అంతేకాదు రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాదు.సురక్షితంగా కూడా ఉంటుంది.
అందుకే రైలు ప్రయాణం ఎక్కువుగా చేయడానికే ఆసక్తి చూపిస్తారు.ప్రతి రోజు కొన్ని లక్షల మంది ప్రజలు మన దేశంలో రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు.
మధ్య తరగతి ప్రజలు మాత్రమే కాదు.ఉన్నత కుటుంబాల ప్రజలు కూడా ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ ఉంటారు.రైలు ప్రయాణం అందరికి అందుబాటులో ఉండే ప్రయాణాల్లో ఇది ఒకటి.అయితే రైలు ను మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ చేసారో తెలుసా.1859 లో మన దేశంలో మొదటిసారి రైళ్లను ప్రవేశ పెట్టారు.మన దేశానికీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951 లో భారతీయ రైల్వే లను జాతీయం చేసారు.
ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రేల్వే వ్యవస్థను విస్తరిస్తూ వస్తున్నారు.
ప్రపంచంలో మన దేశమే రెండవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ కలిగింది.అయితే ఇవన్నీ పక్కన పెడితే రైలు పెట్టెలపై పైభాగంలో ఉండే రెడ్, వైట్, గ్రీన్ వంటి గీతలు దేనికి సంకేతమో తెలుసా.అసలు వాటిని ఎప్పుడైనా చూసారా.
అవి ఎందుకు గీసారో ఆ గీతలకు అర్ధం ఏమిటో తెలుసా.తెలియదా.
అయితే ఇప్పుడు తెలుసుకోండి.
రైలు బోగీలపై పసుపు రంగు గీతలకు అర్ధం ఏమిటంటే.ఆ భోగీలు ప్రత్యేక మైన కోచ్ అని, దివ్యాదుల కోసం, అనారోగ్యంతో బాధపడే వారి కోసం కేటాయించిన కోచ్ లని అర్ధం.అదే తెలుపు రంగు గీతలు ఉంటే ఎక్సప్రెస్, హైస్పీడ్ తో ప్రయాణం చేసే రైళ్లని అర్ధం.
ఇక గ్రీన్ లైన్స్ కానీ బ్లాక్ లైన్స్ కానీ ఉంటే మహిళల కోసం కేటాయించిన కోచ్ లని అర్ధం.విన్నారుగా ఏదో ఉట్టి గీతలు అని అనుకునే వీటికి ఎంత అర్ధం ఉందో.