నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమాలను వదిలేయాలని ఎందుకు అనుకుందో తెలుసా?

సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ తమిళ బ్యూటీ.తొలి సినిమాతోనే తెలుగు ప్రజల మనసు దోచుకుంది.

 Why Sai Pallavi Wants Leave Movies, Sai Pallavi , Tollywood , Fida , Prmam Movie , Shekar Kammula , Love Story , Sai Pallavi Wants Leave Movies ,mari 2, Fida-TeluguStop.com

తన నేచురల్ నటనతో అదరగొట్టింది ఈ హైబ్రిడ్ పిల్ల.చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ప్రత్యేక అభిమానం ఉండే ఈ ముద్దుగుమ్మ.ఎన్నో స్టేజ్ షోలలో తన స్టెప్పులతో ఊపు ఊపింది.నెమ్మదిగా పలు టీవీ డ్యాన్స్ షోలలో పాల్గొంది.ఎంబీబీఎస్ పూర్తికాగానే ఈమెకు సినిమాలో అవకాశం వచ్చింది.తమిళ డైరెక్టర్ అల్ఫోన్స్ ప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.

ఈ సినిమాతో సాయి పల్లవి పేరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్మోగింది.

 Why Sai Pallavi Wants Leave Movies, Sai Pallavi , Tollywood , Fida , Prmam Movie , Shekar Kammula , Love Story , Sai Pallavi Wants Leave Movies ,mari 2, Fida-నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమాలను వదిలేయాలని ఎందుకు అనుకుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రేమమ్ తో వచ్చిన పేరుతో తెలుగులో ఫిదా సినిమా చేసింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సాయి పల్లవి భానుమతి అనే క్యారెక్టర్ చేసింది.తొలి సినిమా చేసినా తెలుగు నేర్చుకుని తన క్యారెక్టర్ కు తనే డబ్బింగ్ చెప్పుకుంది.

ఈ చిత్రంలో సాయిపల్లవి నటన జనాలకు విపరీతరంగా నచ్చింది.ఫిదా మూవీ తర్వాత ఈమెకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.

తన అందంతో పాటు అభినయంతో యువతను ఆకట్టుకుంది.నెమ్మదిగా సౌత్ స్టార్ హీరోయిన్ గా మారింది.అటు మారి-2 సినిమాలో తన డ్యాన్స్ విశ్వరూపం చూపించింది సాయిపల్లవి.తనలోని డ్యాన్స్ స్కిల్స్ ప్రదర్శించింది.ఏ క్యారెక్టర్ ఇచ్చినా చక్కటి నటనతో ప్రాణం పోస్టుంది సాయి పల్లవి.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లించింది.ఎప్పుడైనా మీరు ఏడ్చారా? అనే ప్రశ్నకు సుదీర్ఘ వివరణ ఇచ్చింది.ఎన్టీకే టైంలో చేసిన సీన్ నే మళ్లీ మళ్లీ రీ షూట్ చేశాడట దర్శకుడు.

పలు మార్లు చేసి, చేసి విసుగు వచ్చిందట.దీంతో సినిమాలు వదిలేయాలనుకుంటున్నట్లు తన అమ్మతో చెప్పి ఏడ్చిందట.

ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో విరాట్ పర్వం అనే సినిమా చేస్తుంది.వేణు ఊడుగుల దర్శకుడు.

రానా హీరోగా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు ఆమె మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube