మహర్షి' బడ్జెట్‌ను దిల్‌రాజు ఎందుకు కట్టడి చేయలేక పోయాడు.. అసలు కారణం ఇదేనా?

మహేష్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Why Dil Raj Could Not Stop The Maharishi Budget-TeluguStop.com

అన్ని ఏరియాల్లో మరియు అన్ని రకాల బిజినెస్‌లు కలిపి ఈ చిత్రం ఏకంగా 150 కోట్లకు పైగా బిజినెస్‌ చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇంత భారీ బిజినెస్‌ చేసినందుకు నిర్మాతలకు ఫుల్‌ లాభాలు రావాలి.

కాని ఈ చిత్రం బడ్జెట్‌ హద్దులు దాటడం వల్ల సినిమా వల్ల నిర్మాతలకు లాభాలు రావడం గగనం అయ్యింది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు దర్శకుడు వంశీపైడిపల్లి ఏకంగా 130 నుండి 140 కోట్ల బడ్జెట్‌ పెట్టించాడట.

ముగ్గురు కూడా పెద్ద నిర్మాతలే అవ్వడంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు.దిల్‌రాజు తన ప్రతి సినిమా బడ్జెట్‌ విషయంలో కంట్రోల్‌లో ఉంటాడు.కాని ఈ చిత్రం బడ్జెట్‌ విషయంలో మాత్రం ఎందుకు అలా వ్యవహరించాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో దిల్‌రాజు ఈ చిత్రంను తమ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, లాభాల గురించి పట్టించుకోకుండా దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడని అంటున్నారు.

మహర్షి' బడ్జెట్‌ను దిల్‌రాజు �

ఎంత బడ్జెట్‌ పెట్టినా కూడా మూడు భాగాలు కనుక పెద్దగా ఇబ్బంది లేదు.దానికి తోడు ఈ చిత్రం కథకు ఎంత బడ్జెట్‌ పెట్టినా పర్వాలేదు అని దిల్‌రాజు భావించాడట.అందుకే ఈ చిత్రం కోసం అంత బడ్జెట్‌ ఖర్చు చేస్తూ ఉన్నా కూడా దర్శకుడు వంశీని వారించేందుకు ప్రయత్నించలేదు.

ఆయనకు పూర్తి స్వేచ్చ ఇచ్చి బడ్జెట్‌ విషయంలో పరిధి లేకుండా చేశాడు.దీంతో ఈ చిత్రం బడ్జెట్‌ అమాంతం పెరిగిందని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఎంత బడ్జెట్‌ పెట్టినా కూడా విడుదలకు ముందే నిర్మాతలకు రికవరీ అయ్యింది.అయితే వంద కోట్ల లోపు బడ్జెట్‌ అయితే 50 కి పైగా లాభం వచ్చేది అనేది విశ్లేషకుల వాదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube